📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 10:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆషాఢ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారికి ఇది మరింత ఆనందాన్ని కలిగించే విషయం. రాజమహేంద్రవరం డిపో నుంచి ప్రతి రోజు హైదరాబాద్‌కు నడుపుతున్న ఇంద్ర ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి 15 శాతం టికెట్‌ ధర రాయితీని ఆర్టీసీ అందిస్తోంది. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్ కె. మాధవ్‌ (K. Madhav) వెల్లడించారు.ప్రయాణికులు ఏసీ బస్సులో సూపర్‌ లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ప్రయాణించవచ్చని, అయితే ప్రస్తుతం ఏసీ బస్సు టికెట్‌ ఛార్జీ రూ.1,060 ఉంటే, ఇప్పుడు 15శాతం రాయితీతో రూ.920 మాత్రమే చెల్లించొచ్చన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లడంతో పాటుజ. తిరిగి అటు నుంచి ఇంద్ర ఏసీ బస్సులో ఇక్కడికి వచ్చేవారికి ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. ప్రయాణికులు ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

కాలుష్యం సమస్యలను

కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సిటీ బస్సుల కొరత వెంటాడుతోంది.దీని వల్ల ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రజలు ప్రతి అవసరానికి ద్విచక్ర, త్రిచక్ర లేదా నాలుగు చక్రాల వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీంతో వేలాది ప్రైవేటు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇది ట్రాఫిక్, కాలుష్యం సమస్యలను పెంచుతోంది.ఆర్టీసీ సిటీ బస్సులు నష్టాల వల్ల నిలిచిపోయాయి.నగరాల్లో ఆర్టీసీ సిటీ బస్సులు (RTC city buses) అవసరమని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు 50 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..

రాజమహేంద్రవరం నగరాలకు

7 సీట్ల ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఎక్కువగా తిరగడంతో ఆర్టీసీ సిటీ బస్సులు నష్టాల వల్ల ఆగిపోయాయి. ప్రైవేటు వాహనాలతో పోటీ పడలేక ఆర్టీసీ నష్టపోయింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సిటీ బస్సులు తిప్పాలని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు 50 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని ప్రతిపాదించారు. బస్సులు మంజూరై, ఛార్జింగ్ స్టేషన్లు (Charging stations) ఏర్పాటు చేస్తే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో బస్సులు తిప్పవచ్చు అంటున్నారు. గతంలో బస్సులు నడిపినా లాభం లేక ఆపేశామని, ప్రజల నుంచి వినతులు వస్తే పరిశీలిస్తామంటున్నారు అధికారులు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Srisailam Dam Gates : ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం!

#ACBusOffer #AndhraPradeshNews #APSRTC #APSRTCUpdates #AshadamMonth #BudgetTravel #BumperOffer #BusFareDiscount #DiscountOffer #HyderabadJourney #HyderabadTravel #IndraACBus #PublicTransport #RajahmundryToHyderabad #SaveOnTravel #SuperLuxuryFare #TeluguStates #TravelDeals Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.