విజయవాడ : ఈ నెల 12నుంచి (APRTC) ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘాలు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో వారితో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) జరిపిన చర్చలు సఫలమయ్యాయి. స్త్రీశక్తి పథకం కింద నడుపుతున్న ఐదు రకాల బస్సులకు నిర్వహణ భారం పెరిగిందని, దానికి తగినట్లు అదనపు మొత్తం చెల్లించాలని సంఘం నేతలు డిమాండు చేశారు.
Read also: Minister Atchannaidu: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డెయిరీ వెన్నెముక

ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సమ్మె విరమణ
రద్దీ అధికమైందని, నిర్వహణ ఖర్చులు పెరిగాయని పేర్కొన్నారు. బస్సులకు బీమా కవరేజ్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయని ఆర్టీసీ ఎండీ దృష్టికి తెచ్చారు. (APRTC) వారి డిమాండ్లపై రవాణాశాఖ మంత్రి తోనూ ఎండీ ద్వారకాతిరుమలరావు చర్చించారు. అద్దెబస్సుల యజమానుల 5 ప్రధాన డిమాండ్లను ఈనెల 20లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎండీ హామీ మేరకు ఈనెల 12 నుంచి తలపెట్టిన సమ్మె విరమించుకుంటున్నట్టు అద్దె బస్సుల యజమానులు తెలిపారు. సంక్రాంతి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సమ్మె యోచన విరమించుకున్నట్టు చెప్పారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: