AP Travel Department: ప్రైవేట్ బస్సులు అధిక టికెట్ ధరలపై కఠిన చర్యలు

Read Time:  1 min
AP Travel Department:
AP Travel Department:
FONT SIZE
GET APP

AP Travel Department: సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా తీసుకుని ప్రయాణికులను నిలువు దోపిడీ చేయాలని చూస్తే ఏపీ రవాణా శాఖ ఉపేక్షించదు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. టికెట్ ధరలను పెంచేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించవద్దు. ఆర్టీసీ ఛార్జీలకన్నా గరిష్ఠంగా 50% మాత్రమే టికెట్ ధరలను పెంచుకునే అవకాశం ఉందని కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు.

Read Also: SouthCentral Railway:సంక్రాంతికి మరిన్ని స్పెషల్ రైళ్లు

అంతకుమించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ధరల పెంపును నిరంతరం పర్యవేక్షిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18 వరకు అన్ని జిల్లాల్లో రోజువారీ తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అభి బస్, రెడ్ బస్ వంటి యాప్‌ల ద్వారా కూడా ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు వసూలు చేస్తున్న టికెట్ ధరలను పర్యవేక్షిస్తున్నారు. అధిక ధరలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ప్రయాణికులు అధిక ధరలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ 9281607001 (AP Travel Department) ఏర్పాటు చేశారు. ఈ నంబర్ అన్ని బస్సుల్లో స్పష్టంగా డిస్ ప్లే చేయడం కోసం ట్రావెల్స్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Shiva

రచయిత గురించి

Shiva

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.