విజయవాడ : ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ప్రభుత్వం తమది కాదని విద్య, ఐటి శాఖ మంత్రి నారాలోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గపు చర్యల గుణపాఠం చెప్పి సుపరిపాలన అందిస్తామనే ప్రజలు తమకు అధికారం ఇచ్చారన్నారు. వైఎస్సార్ సిపి మాదిరి రప్పా రప్పా మన విధానం కాదన్నారు. జగన్ లా ప్రజల్ని భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి తెలుగుదేశం సంస్కృతి కాదన్నారు. ఉండవల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం మంత్రులతో నారా లోకేశ్ (Nara lokesh) అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన వారితో వివిధ అంశాలపై చర్చించారు.
Read also: Electricity Charges : విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Thwart the YCP’s conspiracies: Nara Lokesh
వైఎస్సార్సీపీ అసత్య ప్రచారాలకు దీటుగా బదులివ్వాలన్నారు
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎంత మేర సేవ చేశామన్నదే తమ అజెండా కావాలని మంత్రులకు నారా లోకేశ్ సూచించారు. అభివృద్ధి- సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూర్చామన్నదే కూటమి విధానమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కుట్రలను పార్లమెంటు వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. పార్లమెంట్ కేంద్రాల్లో నేతలు ఏకతాటిపై నడుస్తూ వైఎస్సార్సీపీ అసత్య ప్రచారాలకు దీటుగా బదులివ్వాలన్నారు. ప్రజావేదికలో తమకు వచ్చే ఫిర్యాదులు పరిష్కారమయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చేందుకు
తమ శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి మంత్రులు చొరవ చూపాలని వివరించారు. పార్టీ మరింత బలో పేతమే లక్ష్యంగా క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్ఛార్జి మంత్రులు పని చేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో జవాబుదారీ తనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృంద సమావేశంలో లోకేశ్ వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలో ఇందుకు ఉన్న నిబంధనలపై చర్చించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: