AP: సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్

Read Time:  1 min
AP: సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్
FONT SIZE
GET APP

వైసీపీ పాలనలో అనేక వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయని జనసేన అధినేత, (AP) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.”సాధారణంగా వ్యక్తిగతంగా వర్గాలపై కక్షలుంటాయి. వైసీపీ వాళ్లు భగవంతుడిపైనా పగపెట్టుకున్నారు. ఏ నివేదికలోనూ క్లీన్‌చిట్ ఇవ్వలేదనేది వాస్తవం” అని వ్యాఖ్యానించారు. సున్నితమైన అంశాలపై ఆలోచించి మాట్లాడాలని,ఆయన తెలిపారు.

Read Also: YS Jagan Visit: రేపు జోగి రమేష్‌ కుటుంబానికి జగన్‌ పరామర్శ

AP: The fact is that the CBI has not given a clean chit anywhere: Pawan
AP: The fact is that the CBI has not given a clean chit anywhere: Pawan

భక్తుల మనోభావాలను దెబ్బతీశారు

ఈ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదని హెచ్చరించారు. నెయ్యి పేరుతో పామాయిల్, ప్రమాదకరమైన రసాయనాలు వాడి భక్తుల మనోభావాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేటప్పుడు తాము అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.