AP: ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన.. సీఎం

Read Time:  1 min
Chandrababu Naidu compensation
Chandrababu Naidu compensation
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ లో (AP) హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. ఈ మేరకు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ఆయన ఈ రోజు ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ ఇలా చేస్తుందని చంద్రబాబు చెప్పారు. అందుకే వారు బూతులు మాట్లాడుతున్నారని చెబుతూ సంయమనం పాటించాలని చెప్పారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read Also: Srikakulam: ప్రియురాలి అలక ప్రియుడి ప్రాణానికి ముప్పు

AP: ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన.. సీఎం
The CM advised party leaders not to fall into that party’s trap.

తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం

(AP) హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందని, ఆ పార్టీ ట్రాప్‌లో పడితే వారికీ మనకూ తేడా ఉండదని అన్నారు. ఈ సందర్భంగా తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న టీడీపీ అజెండా సహజంగానే వైసీపీ నేతలకు నచ్చదని చంద్రబాబు గుర్తుచేశారు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.