AP: వివేకా హత్యకేసులో సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం

Read Time:  1 min
AP: వివేకా హత్యకేసులో సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం
FONT SIZE
GET APP

విజయవాడ : (AP) వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుపై ట్రయల్ కోర్టు
ఆదేశాలను కొనసాగించాలని సీబీఐని (CBI) సుప్రీంకోర్టు ఆదేశించింది. నెల రోజుల్లో పూర్తి చేయాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వును సవరించి సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దర్యాప్తు సమయంలో ఇంకా ఎవరినైనా పిలవాల్సివస్తే దానికి ఎలాంటి అడ్డంకులు లేవని జస్టిస్ ఎంఎం సుందరేశ్ స్పష్టం చేశారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో ఆ విషయం స్పష్టంగా ఉన్నందున యథాతథంగా దర్యాప్తు కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Read Also: Andhra Pradesh: హైకోర్టులో అంబటి పిటిషన్

AP: వివేకా హత్యకేసులో సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం
Supreme Court issues order to the CBI in the Viveka murder case.

అస్పష్ట వైఖరిపై గతంలోనే వ్యాఖ్యలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలా? అక్కర్లేదా? అన్నది సీబీఐ స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. (AP) ఈ కేసులో సీబీఐ అస్పష్టంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా స్పష్టంగా ఏం కావాలో చెబితే దాని ప్రకారం ముందుకెళ్తామని తెలిపింది. అదే క్రమంలో సుప్రీం కోర్టు తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డిసెంబర్ 10న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన వ్యాజ్యకాలీన దరఖాస్తుపై సుప్రీంకోర్టు 2026 జనవరి 20 విచారణ జరిపింది.

రూ.4 కోట్లు మనీట్రయల్ పై దర్యాప్తు

జస్టిస్ ఎం. ఎం. సుందరేష్, జస్టిస్ ఎన్ కే సింగ్ ధర్మాసనం ముందుకు సునీత దరఖాస్తు విచారణకు వచ్చింది. తన తండ్రి హత్య కేసులో విస్తృత కుట్రకోణాన్ని వెలికితీసే వరకూ సీబీఐ దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని కోరినా కేవలం కిరణ్ యాదవ్, అర్జున్రెడ్డి అనే ఇద్దరి పాత్రపైనే దర్యాప్తునకు అనుమతిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సునీత సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రి వాదనలు వినిపించారు. తాము అడగని అంశాలను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకొని నిర్ణయం వెలువరించిందని కోర్టుకు వివరించారు. రూ.4 కోట్లు మనీట్రయల్ పై దర్యాప్తు అసంపూర్తిగా జరిగిందని దానిపై లోతుగా పరిశీలించాలని కోరారు. సీబీఐ కూడా అదే చెప్పిందని గుర్తుచేశారు. నిందితుల కాల్ రికార్డుల్ని సేకరించడం వల్ల తదుపరి ప్రయోజనంలేదన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.