ఏపీ సర్కార్ స్కూల్ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న స్కూల్స్ తిరిగి తెరిచే రోజునే విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్‌లను అందించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ కిట్‌లో ఒక్కో విద్యార్థికి అవసరమైన పాఠ్య పుస్తకాలు (టెక్స్ట్ బుక్స్) ఉంటాయి. అలాగే వర్క్ బుక్స్, నోట్ బుక్స్, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కూడా ఇస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా
ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫాం, ఒక బ్యాగ్, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్ కూడా ఇస్తారు. ఒకటో తరగతి పిల్లల కోసం బొమ్మలతో కూడిన డిక్షనరీ(Dictionary)ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ నెల 20న తల్లిదండ్రుల, ఉపాధ్యాయ కమిటీ (పీటీఎం) సమావేశం నాటికి పిల్లలందరికీ ఈ కిట్‌లు అందజేస్తారు. ఈ కిట్‌ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రూ.953.71 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఒకేసారి కిట్‌లు అందించాలని భావిస్తున్నారు.
వస్తువులు కొనుగోలు
సకాలంలో కిట్‌లను స్కూల్స్‌కు చేర్చడానికి రాష్ట్ర, జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో SSA కమిటీలను ఏర్పాటు చేశారు. కిట్‌లోని వస్తువుల నాణ్యతను పరిశీలించడానికి ప్రత్యేకంగా ఒక సీనియర్ అధికారిని నియమించారు. వస్తువుల నాణ్యతను పరీక్షించడానికి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో SSA ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి వస్తువును మూడుసార్లు తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులకు ఇస్తారు. కాంట్రాక్ట్ సంస్థల నుంచి వస్తువులు కొనుగోలు చేసిన దగ్గర నుంచి, అవి విద్యార్థులకు చేరే వరకు ఒక యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఫ్యాక్టరీ నుంచి లారీ బయలుదేరినప్పటి నుండి, అది మండలానికి చేరే వరకు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. స్కూళ్లకు పంపిణీ చేసిన తరువాత, విద్యార్థులకు అందినట్లు బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తారు.
యూనిఫాం కుట్టడానికి
ఏపీ ప్రభుత్వం స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు ఒక్కో కిట్‌కు ప్రభుత్వం రూ.2,279 ఖర్చు చేస్తోంది. 2025-26 విద్యా సంవత్సరానికి 35,94,774 మంది విద్యార్థులకు కిట్లకు మొత్తం రూ.953.71 కోట్లు ఖర్చవుతుంది. కేంద్రం రూ.175.03 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.778.68 కోట్లు భరిస్తాయి. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు యూనిఫాం కుట్టడానికి రూ.120, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.240 అందజేస్తారు. గత ప్రభుత్వంలో ఒక్కో కిట్‌ను రూ.2,462కు కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం ఆ ఖర్చును రూ.2,279కి తగ్గించి, రూ.63.80 కోట్లు ఆదా చేసిందని చెబుతున్నారు.
విద్యార్థులకు
యూనిఫాంలను అందిస్తున్నారు.అబ్బాయిలకు ఆలీవ్ గ్రీన్ ప్యాంట్, అమ్మాయిలకు గౌను, లైట్ ఎల్లో,గ్రీన్ చారల చొక్కా ఇస్తారు. ఈసారి అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా కాకుండా ఒకే రంగులో యూనిఫాం(Uniform)లు ఇస్తున్నారు. ఆరో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఇస్తారు. మైనారిటీ భాషలు మాట్లాడే విద్యార్థుల కోసం ఇంగ్లీష్-ఇంగ్లీష్ తో పాటు వారి మాతృభాషలో డిక్షనరీలు ఇస్తారు. ఈ డిక్షనరీలు తమిళ్, ఒడియా, కన్నడ, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటాయి. మొత్తానికి ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లను రెడీ చేసి స్కూల్స్ ఓపెన్ చేసే రోజు విద్యార్థులకు అందజేస్తుంది.
Read Also: Andhra Pradesh: ఓ రోడ్డు ప్రమాదంలో ఊడిన డ్రైవర్ ఉద్యోగం