हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Today News : AP – రాష్ట్రంలో సాఫీగా యూరియా సరఫరా – మంత్రి అచ్చెన్నాయుడు

Shravan
Today News : AP – రాష్ట్రంలో సాఫీగా యూరియా సరఫరా – మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ AP : రాష్ట్రంలో సాఫీగా యూరియా సరఫరా సాగుతుందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్ననాయుడు (Minister Kinjarapu Atchennaidu) ప్రకటించారు. “ఎక్స్” వేదికగా ఆయన చేసిన పోస్టులో ఎరువుల పంపిణీ విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని, ఎక్కడ నిరసనలు లేవని వాటిని అణిచివేసే ధోరణి ఉత్పన్నం కాదని కూటమి ప్రభుత్వం అణిచివేత పనులు చేయదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యూరియా సరఫరా లో గత ప్రభుత్వం కన్నా 48,478 మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు.

పారదర్శక పంపిణీ వ్యవస్థ

కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలించామనే వార్త పూర్తిగా అవాస్తవమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లో మార్క్ ఫెడ్ ద్వారా సొసైటీలకు ఎరువుల సరఫరా నిర్వీర్యం చేస్తే… కూటమి ప్రభుత్వం మార్క్ ఫెడ్ ను గాడిలో పెట్టి సొసైటీలకు అధిక మొత్తంలో యూరియా సరఫరా చేసిందన్నారు. యూరియా సరఫరా, పంపిణీ పూర్తి పారదర్శకంగా అమలు చేస్తూ, గతానికి భిన్నంగా మార్క్ ఫెడ్ పనిచేస్తుందని తెలిపారు. ప్రైవేట్ పంపిణీ నిష్పతి ని 50:50 నుండి 70:30 కు పెంచామని, మార్క్ ఫెడ్ ద్వారా (ఆర్ ఎస్ కె, పీఏసీఎస్) 20 ఎక్కువగా యూరియాను పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని వివరించారు.

AP
AP – రాష్ట్రంలో సాఫీగా యూరియా సరఫరా – మంత్రి అచ్చెన్నాయుడు

గతంతో పోలిస్తే అధిక సరఫరా

2021-22 నుండి 2023-24 వరకు గత ప్రభుత్వం మూడు సంవత్సరాల సరాసరి యూరియా సరఫరా కేవలం 1,55,617 మెట్రిక్ టన్నులు కాగా ఈ ఒక్క సంవత్సరం (2025-26)లో ఆగస్టు చివరి నాటికి 2,04,096 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామని మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం యూరియా సరఫరా 31 శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. విజిలెన్స్, రెవెన్యూ అధికారుల నిరంతర నిఘా, క్రమం తప్పని తనికీలతో అందుబాటు ధరలోనే యూరియా మార్కెట్‌లో ఉందని, ఎటువంటి బ్లాక్ మార్కెట్ (Black market) లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు క్రమశిక్షణతో లైన్లో ఎరువులను తీసుకుంటున్నారని, కానీ వైసీసీ నేతలు వక్రభాష్యం పలకడం వారి చౌకబారుతనమని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో కేంద్రంతో సంప్రదింపులు జరపడం వలన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల కంటే అధిక మొత్తంలో యూరియా కేటాయించబడిందని తెలిపారు.

ఈ సంవత్సరం (2025-26)లో ఆగస్టు చివరి నాటికి రాష్ట్రానికి ఎంత యూరియా సరఫరా చేశారు?
మొత్తం 2,04,096 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశారు.

యూరియా పంపిణీలో ప్రైవేట్ పంపిణీ నిష్పతి ఎంతకు పెంచారు?
50:50 నుండి 70:30 కు పెంచారు.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/polavaram-tenders-worth-rs-739-crore-for-rehabilitation-facilities/andhra-pradesh/541744/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870