AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

Read Time:  1 min
AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (AP) ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన జనరల్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి YCP మహాపరాధం చేసిందని ఆయన ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, అయినా YCP విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. రసాయనాలు, పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన నూనెతో లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఆరోపించారు.

Read Also: AP: ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

AP: SIT did not say there is no animal fat in ghee: Pawan
AP: SIT did not say there is no animal fat in ghee: Pawan

అబద్ధపు ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి

కోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? అనే విషయాన్ని సిట్ బహిర్గతం చేయలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు. రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? అని పార్టీ మీటింగ్‌లో నేతలకు సూచించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.