📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Author Icon By Anusha
Updated: July 5, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం, రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల‌కు ప్రధాన కారణంగా ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి (low pressure trough) వ్యవస్థను గుర్తించామని వాతావరణ శాఖ తెలిపింది.ఇది ఉత్తర గుజరాత్ నుండి పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరం వరకు వ్యాపించి ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఐఎండీ (IMD) కూడా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ‘శనివారం శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు,తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల ఉరుములతో

అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో (Thunderstorms) కూడిన జల్లులు చాలా చోట్ల కురుస్తాయి. గంటకు 40 -50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందంటున్నారు. రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వానలకు ఛాన్స్ ఉందంటున్నారు.అలాగే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది.

AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

మరొకవైపు, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ప్రజలు సీజనల్ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో (Rural Areas) పారిశుద్ధ్యం సరిగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. కలుషిత నీరు కారణంగా వ్యాధులు వస్తాయని, అతిసారం, విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయంటున్నారు. గిరిజన గూడేలు, తండాల్లోని ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: T. Lakshminarayana: పోలవరం బనకచర్ల పథకంపై లోతైన అధ్యయనం చేయండి

#AndhraPradeshWeather #APDisasterManagement #APRainAlert #APRainfall #BayOfBengalTrough #CoastalAndhra #EluruRain #IMDUpdate #IndianWeatherUpdate #Monsoon2025 #RainForecast #RainInAP #SrikakulamWeather #Thunderstorms #WeatherNews Andhra Pradesh Weather AP Disaster Management Authority AP districts rainfall Ap News in Telugu AP rain forecast Bay of Bengal trough Breaking News in Telugu coastal Andhra rain Eluru rain update Google News in Telugu IMD alert Latest News in Telugu light to moderate rains lightning monsoon winds Northeast Arabian Sea Paper Telugu News rain warning rainfall in Andhra Srikakulam rain Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Thunderstorms Today news Yanam weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.