AP: నలుగురు లెక్చరర్ల మధ్య ఒక విద్యార్థి

Read Time:  1 min
AP: నలుగురు లెక్చరర్ల మధ్య ఒక విద్యార్థి
FONT SIZE
GET APP

(AP) ఏలూరు జిల్లా ముసునూరు జడ్పీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజీలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. అయితే పాఠాలు బోధించడానికి మాత్రం నలుగురు లెక్చరర్లు అందుబాటులో ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.4 లక్షల జీతాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Read Also: Chandrababu Naidu: ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి

AP: నలుగురు లెక్చరర్ల మధ్య ఒక విద్యార్థి
One student among four lecturers.

ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి

ఏలూరు జిల్లా ముసునూరు జడ్పీ పాఠశాలలో గత వైసీపీ (YCP) ప్రభుత్వం బైపీసీ గ్రూప్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. (AP) ఇక్కడ నాలుగు సబ్జెక్టులకు నలుగురు లెక్చరర్లును నియమించారు. ప్రారంభంలో ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఒక్క విద్యార్థిని (మొదటి సంవత్సరం) మాత్రమే ఉన్నారు. నలుగురు లెక్చరర్లు ఉన్నారు. ప్రతినెలా నలుగురు లెక్చరర్లకు వేతనాల రూపంలో రూ.4లక్షల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ముసునూరు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టి సారించారు. నివేదికలు అందజేయాలని విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.