AP: ఇక పారిశ్రామిక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

Read Time:  1 min
AP: ఇక పారిశ్రామిక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక
FONT SIZE
GET APP

తిరుపతి : తిరుపతి పరిపాలన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోని (AP) తొమ్మిది జిల్లాల్లో విద్యుత్ (Electricity) పంపిణీ చేస్తున్న ఎస్పీడిసిఎల్ సంస్థ పారిశ్రామిక వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఒక వేదిక నిర్వహిస్తోంది. ఈ వినూత్న కార్యక్రమానికి ఎస్పీడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే గృహ విద్యుత్ వినియోగదారుల, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్పీడిసిఎల్ సిఎండి తో సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించే వీలుకలిగింది.

ఇది సత్ఫలితాలనివ్వడంతో ఇకపై పారిశ్రామిక వినియో గదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఎస్ పిడిసిఎల్ సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లా ల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికై ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.

Read Also: Amaravati Capital: పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్సుగా రూ.3,320 కోట్లు..

AP: ఇక పారిశ్రామిక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీడిసిఎల్

ఇప్పటికే (AP) విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా “డయల్ యువర్ సిఎండి”, “డయల్ యువర్ ఎస్ఈ”, “కరెంటోళ్ళ జనబాట” లాంటి వినూత్న కార్యక్రమాలు విజయవంతం కావడం విశేషం. పారిశ్రామిక రంగాన్ని కూడా ప్రోత్సహించడంలో భాగంగా పారిశ్రామిక విద్యుత్ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా పారిశ్రామిక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ప్రతినెలా మొదటి బుధవారం ఉదయం 10:30గంటల నుండి 11:30గంటల వరకు ఆయా జిల్లాల్లోని సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయాల్లోనూ, ప్రతి మూడవ బుధవారం ఉదయం 10:30గంటల నుంచి 11:30గంటల వరకు ఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు.

పారిశ్రామిక వినియోగదారులు సంబంధిత జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్లును నేరుగా కలిసి తను విద్యుత్ సమస్యలను తెలియజేయాలని సూచించారు. జిల్లా స్థాయిలోని సూపరింటెండింగ్ ఇంజనీర్ పరిధిలో మొదటి బుధవారం పరిష్కారానికి నోచుకోని పారిశ్రామిక విద్యుత్ సమస్యలను మూడవ బుధవారం తిరుపతిలోని ఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సిఎండిని నేరుగా కలిసి సమస్యల్ని విన్నవించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ఈ సదవకాశాన్ని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.