AP: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

Read Time:  1 min
AP: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు వార్డు వారీగా ఫోటోతో కూడిన ఓటరు జాబితాలు తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఓటరు జాబితాలు, అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా తీసుకొని రూపొందించాలి.

Read Also: Anantapur: బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

AP: Notification on Gram Panchayat elections
AP: Notification on Gram Panchayat elections

త్వరలోనే వివరమైన మార్గదర్శకాలు విడుదల

01-01-2026 ను ఓటరు అర్హత తేదీగా పరిగణించాలి.09-03-2026 న ఓటరు జాబితాలను ప్రచురించనున్నారు.గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఈ ప్రక్రియ చేపడుతున్నారు.ఓటరు జాబితాల తయారీ, ప్రచురణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే వివరమైన మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.