AP: క్రైస్తవ సోదరులకు లెంట్ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

Read Time:  1 min
AP: క్రైస్తవ సోదరులకు లెంట్ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
FONT SIZE
GET APP

AP: ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) క్రైస్తవ సోదర సోదరీమణులకు లెంట్ సీజన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 40 రోజుల ఉపవాస దీక్షల ప్రారంభం సందర్భంగా ఆయన తన సందేశాన్ని విడుదల చేశారు.

Read Also: Andhra University: AUలో ఉద్రిక్తత, ABVP–SFI మధ్య ఘర్షణ

AP: క్రైస్తవ సోదరులకు లెంట్ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
AP: Nara Lokesh extends Lent greetings to Christian brothers

లెంట్ పవిత్ర కాలాన్ని పాటిస్తున్న క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యేసు క్రీస్తు జీవితం, త్యాగాలను స్మరించుకుంటూ 40 రోజుల పాటు ఉపవాసం, ప్రార్థన, ధ్యానంతో గడిపే ఈ పవిత్రమైన సమయం ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని, కరుణను, ఆశను పునరుద్ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. తన సందేశాన్ని ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఆయన పోస్ట్‌పై క్రైస్తవ సంఘాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. పలువురు నెటిజన్లు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.