ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారి అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి సమీపంగా మరో మినీ బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. హైదరాబాద్ వెళ్లే హైవేలో మంత్రి నియోజకవర్గానికి ఈ బైపాస్ ప్లాన్ చేశారు,మంత్రికి చెందిన నియోజకవర్గం కావడంతో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత నెలకొంది. ఈ మేరకు నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా అద్దంకి కొండ దగ్గర స్థలాలు కేటాయిస్తున్నారు అధికారులు. ఈ పనులన్నీ పూర్తయితే, NAM రోడ్డులో ట్రాఫిక్ తగ్గి ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది.ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేయగా త్వరలో టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అధికారులు
మినీ బైపాస్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కొంతమేర తగ్గి రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే అద్దంకి కాలువ కట్టపై తాత్కాలికంగా నివాసం ఉంటున్న సుమారు 70 కుటుంబాలను గుర్తించారు. వీరికి అద్దంకి కొండ దగ్గర శింగరకొండపాలెం (Singarakondapalem) దగ్గర స్థలాలు ఇస్తున్నారు. అధికారులు ఆయా కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ఖాళీ చేసి అద్దంకి కొండ దగ్గర కేటాయించే స్థలానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.ప్రస్తుతం ఆ స్థలంలో పెద్ద గోతులు ఉండటంతో వాటిని చదును చేసే పనులు మొదలుపెట్టారు. అయితే రేణింగవరం నుంచి NAM రోడ్డు వరకు కాలువ మధ్యలో ఉంచి రెండువైపులా సిమెంట్ రోడ్లు వేస్తారు. అంతేకాదు మురుగు నీరు వెళ్లేందుకు వీలుగా సైడ్ డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేస్తారు.

పనులు వేగవంతం
విజయవాడ-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేస్తున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ సహాయం చేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లను ఉపయోగించి స్థలాన్ని చదును చేస్తున్నారు. అనంతరం రోడ్లు వేసి, విద్యుత్ సౌకర్యం, నీటి వసతి కల్పిస్తారు. జులై చివరి నాటికి కాలువ కట్టపై ఉన్న ఇళ్లను తొలగించాలని అధికారులు భావిస్తున్నారు.ఆ దిశగా పనులు వేగవంతం చేశారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైపు నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్‌కు వెళ్లాలంటే అద్దంకి మీదుగా నార్కెట్‌పల్లి హైవే ఎక్కాలి కాబట్టి అద్దంకి మినీ బైపాస్ (Addanki Mini bypass) ఎంతో ఉపయోగంగా ఉంటుందంటున్నారు.
Read Also: Sriharikota: శ్రీహరికోటలో ఉగ్రవాదులు ఉన్నారంటూ బెదిరింపు