AP New Pensions: ఏపీలో మూడు లక్షల కొత్త పింఛన్లు మంజూరు

Follow Us: Google News Daily Hunt
New Pensions
New Pensions
FONT SIZE
GET APP

AP New Pensions:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు మరో మూడు లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. సెప్టెంబర్ రెండో వారం నుంచి గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత అలాగే గీత కార్మికులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Read also: Visakhapatnam news: ఐఫోన్ కొనివ్వలేదని విద్యార్థిని బలవన్మరణం

Government moves towards new pensions in AP.
Government moves towards new pensions in AP.

దరఖాస్తు చేయాల్సిన విధానం

ఈ కొత్త పింఛన్ల పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వారు కొన్ని ముఖ్యమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్, మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. వీటితో పాటు సంబంధిత వర్గానికి చెందిన ప్రత్యేక ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా తమ ప్రాంతంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించి దరఖాస్తు అందజేయవచ్చు.

AP New Pensions:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల సమర్పణ

సచివాలయాలకు వెళ్లలేని వారు అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ sspensions.ap.gov.in పోవిడెడ్ లింక్ ద్వారా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. అర్హులైన నిరుపేదలు ఎవరూ మిగిలిపోకుండా అధికారులు ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు