AP: కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక నిర్ణయం

Read Time:  1 min
AP: కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక నిర్ణయం
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లో(AP) కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాజాగా కేంద్రమంత్రి కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేయాలని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI)ను కోరిందని.. ఈ నెలలోనే ఈ అభ్యర్థన చేసినట్లు కేంద్రమంత్రి మురళీధర్‌ మోహోల్‌ తెలిపారు. విమానాశ్రయం కోసం అవసరమైన స్థలం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐకి అందించినట్లు తెలిపారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

Read Also: CM Chandrababu Naidu: రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ

AP: కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక నిర్ణయం

కేంద్ర పరిశీలనలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రతిపాదనలు

ఏఏఐ ఇప్పటికే (AP) కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక అధ్యయనాలను పూర్తి చేసినట్లు కేంద్రమంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. ఈ మూడు చోట్ల విమానాశ్రయాలు నిర్మించడానికి అవసరమైన భూమి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ విధానం కింద పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.