AP: ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ‘బాకీకి భూమి’ అమలు చేయండి

Read Time:  1 min
AP: ఉద్యోగుల సమస్య పరిష్కారానికి 'బాకీకి భూమి' అమలు చేయండి
AP: ఉద్యోగుల సమస్య పరిష్కారానికి 'బాకీకి భూమి' అమలు చేయండి
FONT SIZE
GET APP

శ్రీకాళహస్తి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై స్పందన లేదని త్వరలో జరగబోవు శాసన సభ సమావేశాల్లో చర్చించాలని ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు గురువారం స్థానిక శాసనసభ్యుడు బొజ్జల సుధీర్రెడ్డి, తిరుపతి జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీలకు విన్నవించారు. ఆర్థిక భారం నుంచి ప్రభుత్వం (Government) బయటపడటానికి పరిష్కారంగకి భూమిని అందించాలని ఓ ప్రతిపాదనను ప్రజా ప్రతినిధులకు విన్నవించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు వారి సమస్యలను వివరిస్తూ ఉద్యోగ, ఉపాధ్యా, పెన్షనర్లకు హక్కుగా సంక్రమించి వి విధ రకాల ఆర్థిక ప్రయోజనాలు సుమారు రూ.35 వేల కోట్లకు సంబంధించి పెండింగ్లో ఉందని వివరించారు.

Read Also: AP: వివేకా హత్యకేసులో సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం

AP: ఉద్యోగుల సమస్య పరిష్కారానికి 'బాకీకి భూమి' అమలు చేయండి
Implement the ‘land in lieu of dues’ scheme to resolve employees’ problems.

వేతన సవరణ, 4విడతల డిఎల బకాయిలపై శాసనససభలో

ఇక వేతన సవరణ, 4విడతల డిఏ బకాయి. (AP) సరెండర్ లీవ్ వెరసి వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి ఆసాధ్యంగా మారిన నేపధ్యంలో ప్రత్యామ్నయ పరిష్కార మార్గంగా ‘బాకీకి భూమి’ అనే ప్రతిపాదనను శాసనసభలో చర్చించాలన్నారు. ఇటు ‘రండీ-టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమం ద్వారా చర్చలు జరుగుతున్నాయని నాయకకుల దృష్టికి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు తీవ్ర గందరగోళం, అయోమయ పరిస్థితి నెలకొందని తమ బాధలను మొరబెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన బకాయిలు, ఇంకనూ మంజూరు కావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, వేతన సవరణ కమిషనన్ను ముగ్గురు సభ్యుల కమిటిగా ఏర్పాటు చేయాలని కోరారు.

సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ డిమాండ్

మధ్యంతర భృతి తదితర అర్థికపరమైన అంశాలలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టే రాష్ట్రబడ్జెట్లో తగిన కేటాయింపులు ప్రతిపాదించాలని అభ్యర్థించారు. సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. (AP) తెలుగుదేశం, జనసేన రాజకీయ పార్టీల ఉమ్మడి ఎన్నికల మెనిఫేస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్, జిపిఎస్ విధానాలను పునః సమీక్షించి ఏడాది లోగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించుటకు శాసనసభలో ప్రస్తావించాలని కోరారు. ఈ బడ్జెట్ సమావేశంలోనే ప్రభుత్వం తన విధానాన్ని, నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల అభ్యర్థనను తాను తప్పక శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తానని శాసనసభ్యుడు బొజ్జల సుధీర్రెడ్డి ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.