📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Electric Buses: ఏపీకి కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు..రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

Author Icon By Anusha
Updated: June 20, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కేంద్రం నుంచి మరోసారి తీపికబురు అందింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డుమార్గ రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) 750 ఎలక్ట్రిక్ బస్సులను పొందనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.కేంద్రం మొదటి దశలో 750 బస్సులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్ కూడా ఎంపికయ్యారు. నగరాల్లో (Cities)12 మీటర్లు, 9 మీటర్లు పొడవు ఉన్న రెండు రకాల ఏసీ సిటీ బస్సులు తిరిగేలా ప్లాన్ చేశారు. మొదటి దశలో 750 బస్సుల్లో 9 మీటర్ల పొడవున్న ఏసీ బస్సులు 129 ఉంటే వీటికి కిలోమీటరుకు రూ.62.17 చొప్పున అద్దె చెల్లిస్తారు. అలాగే 12 మీటర్ల పొడవున్న ఏసీ బస్సులు 621 ఉంటే వీటికి కిలోమీటరుకు రూ.72.55 చెల్లిస్తారు. APSRTC 11 నగరాల్లోని 12 డిపోల వద్ద ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సిద్ధమైంది.

అమరావతిలో

విశాఖపట్నానికి 100 సిటీ బస్సులు, సింహపురి డిపోకు 50, గాజువాక డిపోకు 50 బస్సులు కేటాయించారు. విజయవాడకు 100 బస్సులు రానున్నాయి. ఇవన్నీ విద్యాధరపురం డిపోకు కేటాయించారు. కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం డిపోలకు 50 బస్సుల చొప్పున కేటాయించారు. గుంటూరు (Guntur) నగరంలో గుంటూరు -2 డిపోకు 100 బస్సులు రానున్నాయి. అమరావతి కోసం 50 సిటీ బస్సులు కేటాయించారు. నెల్లూరు టౌన్లో నెల్లూరు -2 డిపోకు 100 బస్సులు, కర్నూలు – 2 డిపోకు 50 బస్సులు వస్తాయి.రాజధాని అమరావతిలో తిరిగేందుకు మంగళగిరి డిపోకు 50 సిటీ బస్సులు ఇస్తారు.

Electric Buses

ఆర్టీసీ నిర్ణయించింది

తిరుపతిలో మంగళం డిపోకు 50 బస్సులు రానున్నాయి.కొత్త బస్సులు వస్తుండటంతో సిబ్బంది అవసరం అవుతుంది అందుకే ఆర్టీసీ సిబ్బంది (RTC Staff)నియామకంపై ఫోకస్ పెట్టింది. డిపోల్లో సిబ్బందిని ఏ విధంగా నియమించాలో నిర్ణయిస్తారు. ఈ విషయంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. దానిని అమలు చేస్తారు. మూడు నెలల్లో అన్ని ఏర్పాట్లు చేసి, బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అంతేకాదు రాష్ట్రంలో కొత్త డిపోలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. డీజిల్, సీఎన్జీ బస్సుల్ని కొనడం ఆపేసి అన్ని ఎలక్ట్రిక్ బస్సులనే కొనాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

Read Also: Charlapalli: ఆంధ్రా నుంచి చర్లపల్లి, లింగపల్లికి ప్రత్యేక రైళ్ల

#AndhraPradesh #ElectricBuses #SustainableTransport Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.