📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Congress: ఏపీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు

Author Icon By Anusha
Updated: June 10, 2025 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఓ కీలక మలుపు తిరిగాయి.ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila) లక్ష్యంగా కడపలో నిర్వహించిన ఓ సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఏర్పాటు చేసిన ఈ భేటీని షర్మిల వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కడపలోని ఐఎంఏ హాలు(IMA Hall)లో నిన్న జరిగిందీ ఘటన. 

పూర్తి వివరాలు

సుంకర పద్మశ్రీ(Sunkara Padma Shri) ఆదివారం రెండు రోజుల పర్యటన నిమిత్తం కడపకు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా నిన్న ఆమె ఐఎంఏ హాలులో కొందరు కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ డీసీసీ అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు, నజీర్‌ అహమ్మద్‌ (ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు), ఎస్‌ఏ సత్తార్‌తో పాటు మరికొందరు అసమ్మతి నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం ఉద్దేశం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పనితీరుపై చర్చించడమేనని సమాచారం.అయితే, ఈ సమావేశం గురించి తెలుసుకున్న షర్మిల మద్దతుదారులు డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి నాయకత్వంలో అక్కడికి చేరుకున్నారు.

నినాదాలు

నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఇర్ఫాన్‌బాషా, అశోక్‌ రెడ్డి, ధ్రువకుమార్‌ రెడ్డి, శివమోహన్‌ రెడ్డి, మైనుద్దీన్‌ తదితరులు సుంకర పద్మశ్రీ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. “వైఎస్‌ షర్మిలారెడ్డి జిందాబాద్‌” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా పద్మశ్రీ వర్గం “రాహుల్‌ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. ఒకానొక దశలో నేతలు చొక్కాలు పట్టుకుని ఘర్షణకు దిగేంత వరకు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

AP Congress

పూర్వ వైభవం

సమావేశం అనంతరం సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల కేవలం జగన్‌మోహన్ రెడ్డి(Jaganmohan Reddy)ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. షర్మిల పనితీరు సరిగా లేదని, ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని పద్మశ్రీ స్పష్టం చేశారు.

తీవ్ర ఆగ్రహం

మరోవైపు, షర్మిలకు వ్యతిరేకంగా సుంకర పద్మశ్రీ వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్‌లోని షర్మిల వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకర పద్మశ్రీ ఒక పథకం ప్రకారం ఎవరో ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని కడప(Kadapa)కు వచ్చి షర్మిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని వారు తెలిపారు. ఈ ఘటన కడప జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది.

Read Also: Kommineni Srinivasa Rao: వైద్య ప‌రీక్ష‌ల కోసం కొమ్మినేని శ్రీనివాస‌రావు తరలింప

#CongressRow #KadapaClash #PCCAndhra #Sunkara Padma Shri #YSSharmila Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.