అనంతపురం: ఇంటిగ్రేటెడ్ డాస్ బోర్డు అనే నూతన వెబ్సైట్ను రాష్ట్రంలోని 123 నగర, పురపాలక సంస్థలకు అనుసంధానం చేస్తూ (AP) రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు (Ponguru Narayana) నారాయణ ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ను ప్రారంభించారు. నగరశివారులో వున్న జెఎన్టిటియూ రోడ్డులో వున్న ఆర్యభట్ట ఆడిటోరియం(డా. ఏపిజె అబ్దుల్కలాం న్యూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్)లో శుక్రవారం పురపాలిక అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Read Also: Minister NaraLokesh: కాకినాడలో 60 పడకల కోరమాండల్ ఆసుపత్రిని

సాంకేతికతతో పట్టణాభివృద్ధికి కొత్త దిశ
ఈ సమావేశంలో (AP) వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రితో పాటు పురపాలక అడ్మిని స్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్కుమార్ సిర్డీఏ కమిషనర్ కన్నబాబులు హాజరైయ్యారు. ప్రాంతీయ సమీక్షా సమావేశంలో కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సిడిఎంఏ) సంపత్కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) ప్రభాకర్రావు, టిడ్కో ఎండి సునీల్ రెడ్డి, పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లత, ప్రజా ఆరోగ్య ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, మున్సిపల్ శాఖ డైరెక్టరేట్తో పాటు 42 నగర, పురపాలక సంస్థల కమిషనర్లు, విభాగాధి పతులు పాల్గొన్నారు.
ఈ ప్రాంతీయ సదస్సుకు అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బి. బాల స్వామి అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాంతీయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అనివార్య కారణాల వల్ల మంత్రి నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డిలు హాజరుకాక పోవడంతో వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా ప్రాంతీయ సమీక్షా సమావేశంలోని కమిషనర్లకు నగర, పట్టణాలు అభివృద్ధికి చేపట్టాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.
నిర్లక్ష్యం వహించేవారిపై కఠినచర్యలు
ఈ సందర్భంగా (AP) మంత్రి నారాయణ నూతన వెబ్సైట్ రూపకల్పన చేసి టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చినందుకు పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లతను ప్రత్యేకంగా అభినందలు తెలిపారు. ఈ వెబ్సైట్ను 123 నగర, పురపాలక సంస్థలకు అనుసంధానం చేస్తూ మంత్రి ఆన్లైన్ ద్వారా ప్రారంభించి, సాంకేతికతను సద్వినియోగం చేసుకుని నగర, పట్టణాలు అభివృద్ధి పథంలోకి తీసుకురా వాలని కమిషనర్లకు సూచించారు. అన్ని పురపాలక సంస్థల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, రోడ్డు, వీధిలైట్లకు ప్రాధాన్యతన ఇవ్వాలని, ప్రతి రోజూ పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్లు మానిటరింగ్ చేయాలని, రోడ్లను ఊడ్చేందుకు స్వీపింగ్ మిషన్లు
మాత్రమే ఉపయోగించాలన్నారు.
అనధికార భవన నిర్మాణాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, వచ్చే ఉగాదికి లక్ష ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందిచాలన్నది ముఖ్యమంత్రి లక్ష్య మని, మిగిలిన వాటిని జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. అలాగే మార్చి31లోపు లెగసీ వెస్టు పూర్తిగా తొలగించి వాటి స్థానంలో పార్కులను అభి వృద్ధి చేయాలని, కుక్కలు, పందులతో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధా నంగా టౌన్లైనింగ్ విభాగం ప్రత్యేక దృష్టి సారించి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా క్రమ బద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవా లన్నారు. కమిషనర్లు సమన్వయంతో విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా వుందని, నిర్లక్ష్యం వహించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: