📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Dumping Yard: డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా ఏపీ

Author Icon By Vanipushpa
Updated: June 11, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ను డంపింగ్ యార్డ్ (Dumping Yard)రహిత రాష్ట్రంగా మార్చేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ప్రతి రోజూ వచ్చే ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ను సమర్థవంతంగా చేయడం ద్వారా గమ్యాన్ని సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తుంది.. ఇ ప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు(Vishakapatnam, Guntor) లో ఉన్న చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ ల ద్వారా ఘన వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు..త్వరలో మరో రెండు ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. .అయితే ఘన వ్యర్థాల నుంచి కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా కంపోస్ట్, ఇతర అవసరాలకు వినియోగించే పదార్థాలను కూడా తయారు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని భావిస్తుంది… దీనికోసం పలు ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను మంత్రి నారాయణ సందర్శిస్తున్నారు. తాజాగా వ్యర్థాల నిర్వహణకు సంబంధించి అధ్యయనం చేసేందుకు మంత్రి నారాయణ బృందం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో పర్యటించింది.. సోమవారం సాయంత్రం పూణే చేరుకున్న మంత్రి నారాయణ బృందం…. అక్కడి నుంచి పింప్రి చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి వేస్ టూ ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించింది. అక్కడ ఘన వ్యర్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ఏ విధంగా అక్కడ అధికారులు మంత్రి నారాయణ బృందానికి వివరించారు.. ఈ పర్యటనలో మంత్రి నారాయణతో పాటుగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.. పింప్రి చించివాడ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లో ప్రతిరోజు కూడా 14 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.

Dumping Yard: డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా ఏపీ

లక్నోకు చేరుకున్న మంత్రి బృందం
ఇదే ప్లాంట్ లో విద్యుత్ తో పాటు బయోగ్యాసును కూడా ఉత్పత్తి చేస్తున్నారు.. ప్లాంట్ పనితీరు, విద్యుత్ వినియోగంపై మున్సిపల్ మంత్రి నారాయణ కు అక్కడి కార్పొరేషన్ అధికారులు వివరించారు. ఇక బుధవారం మంత్రి బృందం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకుంది. లక్నో చేరుకున్న మంత్రి నారాయణ బృందానికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుష్మా ఖరాక్వాల్, కమిషనర్ గౌరవ్ కుమార్ ఘనస్వాగతం పలికారు.. లక్నో వెళ్లిన మంత్రి బృందంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాసులు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలీమ్ భాష కూడా ఉన్నారు.

చెత్త నుంచి వచ్చే పౌడర్ ద్వారా ఇటుకుల తయారు

లక్నోలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను పలు రకాలుగా విభజిస్తూ స్థానిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు.. శివ్ ప్రాంతంలో ఉన్న ప్లాంట్ కు సంబంధించి ఘనవర్గాలను ఏరకంగా ఉపయోగిస్తున్నామనే అంశాలను మున్సివల్ కార్పొరేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి నారాయణ బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరి వెళ్లింది మంత్రి నారాయణ బృందం. క్షేత్రస్థాయిలో సందర్శించింది. అక్కడ ఘన వ్యర్ధాల నుంచి బయో గ్యాస్ తో పాటు చెత్త నుంచి వచ్చే పౌడర్ ద్వారా ఇటుకులను కూడా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత లక్నోలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ మిశ్రా పార్కును మంత్రి నారాయణ బృందం సందర్శించింది.. ఈ పార్కు లక్నో మున్సిపల్ కార్పొరేషన్ అద్భుతంగా నిర్మించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఏపీ మంత్రి పొంగూరు నారాయణబేటీ లక్నోలోని కాళిదాస్ మార్గ్ లో ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ నివాసంలో ఆయన పురపాలకశాఖా మంత్రి పి. నారాయణ సమావేశమయ్యారు.

Read Also: Chandrababu Naidu: రేపు అమరావతిలో కూటమి సమావేశానికి ఏర్పాట్లు..

#telugu News AP becomes Ap News in Telugu Breaking News in Telugu dumping yard-free state Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.