AP: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : సీఎం చంద్రబాబు

Read Time:  1 min
AP: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : సీఎం చంద్రబాబు
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో భవిష్యత్ తరాల భద్రత, అభివృద్ధి దృష్ట్యా కీలక నిర్ణయాలను వెల్లడించారు.16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించేందుకు త్వరలోనే ప్రత్యేక కార్యాచరణ తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారం, శాంతిభద్రతలపై కూడా చర్చించారు.గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలి. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి’ అని సూచించారు.

Read Also: Nellore Nawabpet Crime News: నెల్లూరు వివాహిత హత్య కేసులో నిందితుడు అరెస్ట్

AP: Ban social media for children: CM Chandrababu
AP: Ban social media for children: CM Chandrababu

సమగ్ర ప్రణాళిక ఉండాలి

16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై అధ్యయనం చేయాలి.. వరుసగా అవగాహనా సదస్సులు నిర్వహించాలి.. తల్లిదండ్రులు, విద్యార్థులకు సోషల్ మీడియా ప్రమాదాలపై అవగాహన కల్పించాలి.. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారు. చట్టపరమైన అంశాలు, సాంకేతిక పరిష్కారాలు, అవగాహనా కార్యక్రమాలు అన్నింటినీ కలిపిన సమగ్ర ప్రణాళిక ఉండాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.