AP: వైసీపీ నేతలకు వరుస షాకులు.. తాజాగా మరో ఇద్దరికి

Read Time:  1 min
AP: వైసీపీ నేతలకు వరుస షాకులు.. తాజాగా మరో ఇద్దరికి
FONT SIZE
GET APP

ఏపీలో (AP) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ మీద కేసులు నమోదు కాగా తాజాగా మరికొందరు మాజీ మంత్రులు కూడా కేసులు, నోటీసులతో ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి.

Read Also: AP: ఇక పారిశ్రామిక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

AP: వైసీపీ నేతలకు వరుస షాకులు.. తాజాగా మరో ఇద్దరికి
A series of shocks for YSRCP leaders now two more.

మరో ఇద్దరికి పోలీసులు నోటీసులు

మరోవైపు (AP) వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu), ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కాకాణిపై కేసులు నమోదయ్యాయి. నెల్లూరు గ్రామీణం, మనుబోలు, పొదలకూరులో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాలంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

అటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపైనా కేసు నమోదైంది. జనవరి 31వ తేదీ వినుకొండలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో బొల్లా బ్రహ్మనాయుడు, ఇతర వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోపులాట జరగ్గా ఓ కానిస్టేబుల్‌ను వైసీపీ నేతలు తోసేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో కానిస్టేబుల్ గాయపడినట్లు చెప్తున్నారు. ఈ కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగానే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటుగా 27 మంది వైసీపీ నేతలపై వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.