AP: బర్డ్ ఫ్లూ తో 28 వేల కోళ్లు మృతి

Read Time:  1 min
AP: బర్డ్ ఫ్లూ తో 28 వేల కోళ్లు మృతి
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి పంజా విసురుతోంది. చిత్తూరు జిల్లా సదుం మండలంలో ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. గత వారం రోజులుగా మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందుతున్నాయి.స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు చేపట్టిన ప్రాథమిక పరీక్షల్లో వీటికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

Read Also: Devarapalli Ashram School: గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్‌

AP: 28,000 chickens die from bird flu
AP: 28,000 chickens die from bird flu

అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు

మండలంలోని మూడు ప్రధాన కోళ్ల ఫారాల్లో సుమారు 28 వేల కోళ్లు వైరస్ బారిన పడి చనిపోయినట్లు తెలిసింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.ఊరి వెలుపల జేసీబీ సాయంతో భారీ గుంతలు తీసి.. శాస్త్రీయ పద్ధతిలో వాటిని పూడ్చివేస్తున్నారు.

ఈ ఘటనపై స్థానిక ఎమ్మార్వో స్పందిస్తూ.. వ్యాధి ప్రబలిన మూడు కోళ్ల ఫారాలను తక్షణమే సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఎవరూ ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోళ్ల వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయవద్దని ఎమ్మార్వో సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.