Visakhapatnam : విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో అధికార పక్షం నెగ్గింది. మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 74 మంది సభ్యులు ఓట్లు వేయడంతో హరివెంకట కుమారి మేయర్ పీఠాన్ని కోల్పోయారు. దాంతో వైసీపీ నుంచి వైసీపీకి విశాఖ మేయర్ పీఠం దూరమైంది. ఓటింగ్ కు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు.
జీవీఎంసీ ఆఫీసు వద్ద భారీగా పోలీసు బందోబస్తు
కూటమి సభ్యులు త్వరలో విశాఖ మేయర్ ను ఎన్నుకోనున్నారు. కోరం సరిపోవడంతో ఇంచార్జ్ సమావేశం నిర్వహించారు. వైసీపీ నుంచి కూటమిలో చేరిన కార్పొరేటర్లు సైతం అవిశ్వాసంపై వ్యతిరేకంగా ఓటు వేయడంతో కూటమి తన పంతం నెగ్గించుకుంది. మరోవైపు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్ ఉండటంతో జీవీఎంసీ ఆఫీసు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా.. మద్దతుగా 74 ఓట్లు
గత కొన్ని రోజులుగా విశాఖ మేయర్ పీఠంపై నెలకొన్న సస్సెన్స్ వీడింది. కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దాంతోవిశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టారు. దాదాపుగా 30 మంది జీవీఎంసీ కార్పొరేటర్లు కూటమి పార్టీలలో చేరి మద్దతు ప్రకటించారు. దాంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్ పీఠం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి కావాల్సిన కోరం ఉండటంతో ఇంచార్జ్ సమావేశం నిర్వహించి, మేయర్ పై అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా.. మద్దతుగా 74 ఓట్లు రావడంతో వైసీపీ మేయర్ పీఠాన్ని కోల్పోయింది. తమ గెలుపుతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.