📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Annadata Sukhibhava: వచ్చే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు

Author Icon By Anusha
Updated: May 30, 2025 • 5:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పుకొచ్చారు. ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశామో రాబోయే రోజుల్లో ఏం చేస్తామో కడపలో జరిగిన మహానాడు(Mahanadu) ద్వారా వివరించామన్నారు.ప్రజలతో నేతలు మరింత మమేకం కావడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని సూచనలు చేశారు.ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడాకి కారణం కూడా అదేనని వివరించారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు కూడా కచ్చితంగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనాలని జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామని మరోసారి తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ(Free bus travel) సౌకర్యం కల్పించబోతున్నామని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ కేలండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కార్యకర్తల్లా

టీడీపీ మహానాడు కడపలో అద్భుతంగా జరిగిందని ప్రస్తావించారు చంద్రబాబు. కడప జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని ప్రశంసించారు. మహానాడును ఇంత సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు తెలిపారు. కార్యకర్తలకు హాట్సాఫ్ చెప్పారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప(Kadapa) మహానాడుతో నిరూపితమైందని వ్యాఖ్యానించారు. మహానాడు కోసం మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. కడప మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుంటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు.

Annadata Sukhibhava: వచ్చే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు

సంగతి

ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) మహానాడును విజయవంతం చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. మహానాడు కడప గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసేలా నిర్వహించామన్నారు. మహానాడు టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపిందన్నారు.మహానాడులో ఆమోదించిన తీర్మానాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కడప వెనుకబాటు తనాన్ని వైఎస్సార్ కుటుంబం తమ రాజకీయాల కోసం వాడుకుందని విమర్శించారు. మహానాడు ఆ కుటుంబానికి చెంపపెట్టుగా వ్యాఖ్యానించారు. కడప వేదికగా మూడు రోజుల పాటూ తెలుగు దేశం పార్టీ(Telugu Desam Party) మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మూడు రోజుల మహానాడులో పలు కీలకమైన తీర్మానాలను ప్రవేశపెట్టి వాటిని ఆమోదించారు.

Read Also: TTD: తిరుమల భద్రత పై ఉన్నతస్థాయి సమావేశం

#AnnadataScheme #ChandrababuNaidu #MLAParticipation #PensionDistribution #TalliKiVandanam #WelfareSchemes Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.