📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Anita: స్వర్ణాంధ్ర 2047 లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : జిల్లా ఇన్ చార్జి మంత్రి అనిత

Author Icon By Ramya
Updated: July 4, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక, పి4 కార్యక్రమాలపై సమీక్షించిన మంత్రుల సమీక్ష

Vijayanagaram: స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం విజన్ ప్రణాళిక రూపొందించిందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత (Anita) తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక, పి.4 కార్యక్రమాలపై మంత్రులు వంగలపూడి అనిత (Anita), కొండపల్లి శ్రీనివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి వచ్చే ఐదేళ్లకు ఒక ప్రణాళిక, 2047 నాటికి మరో ప్రణాళిక (Another plan by 2047) రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం వ్యవసాయ, అనుబంధ రంగాలలో సాగులో లేకుండా ఉన్న భూములను గుర్తించి, ప్రత్యామ్నాయ పంటలు, అంతర పంటలు వేసి సాగును పెంచి, దిగుబడిని కూడా పెంచి, మార్కెటింగ్ కు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందుకోసం వ్యవసాయ, అనుబంధ శాఖలు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు.

Anita: స్వర్ణాంధ్ర 2047 లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : జిల్లా ఇన్ చార్జి మంత్రి అనిత

వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం కార్యాచరణ ప్రణాళికలు అవసరం

జిల్లాకు వ్యవసాయాధారిత పరిశ్రమలు వచ్చేలా క్షేత్ర స్థాయిలో ప్లానింగ్ ఉండాలని, ప్రణాళికలను కార్యాచరణలోకి తేవడం ముఖ్యమని మంత్రి తెలిపారు. ఎం.ఎస్.ఎం.ఈ, సెర్చ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటలకు ఎక్కువగా అవకాశం ఉందని, అందులో వాణిజ్య పంటలకు ఎక్కువ గిరాకీ ఉంటుందని, ఈ పంటల పై ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోందని, దీనిపై విసృత ప్రచారం జరగాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం క్లస్టర్ మాపింగ్ క్రింద సహాయాన్ని అందిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో మ్యాంగో క్లస్టర్ మాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సర్వీస్ సెక్టార్ క్రింద పర్యాటక రంగంలో సన్ రే రిసార్ట్స్ 150 కోట్లతో, ఎయిర్ పోర్ట్ నందు జి.ఎం.ఆర్ వారు 150 కోట్లతో అదాని గ్రూప్ 100 కోట్లతో హోటళ్ళను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. అలాగే ఎకో టూరిజం క్రింద తాటిపూడి జలాశయంను అభివృద్ధి చేయడానికి 23 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున మాట్లాడుతూ జిల్లా పర్యాటక కేంద్రాలను వెబ్సైట్లో పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. పి4 లో భాగంగా తాను ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిత వెల్లడించారు. పి4 అంటే ఆర్ధిక అంశాలే కాదని, విద్య తదితర ఆర్థికేతర అంశాలలో కూడా సహాయ పడవచ్చునని తెలిపారు. జిల్లాలో 6700 బంగారు కుటుంబాలు ఉన్నాయని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దత్తత తీసుకునేం దుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Excellence Awards: ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అవార్డుల ప్రకటన

#AdaniGroup #AgriBasedIndustries #AgricultureGrowth #AndhraPradeshDevelopment #AndhraPradeshTourism #EcoTourism #FamilyAdoption #GMRAirport #MangoCluster #MSME #P4Initiative #PovertyFreeState #RuralTourism #SunRayResorts #SwarnaAndhra2047 #TatipudiReservoir #Vision2047 #Vizianagaram Adani Group agri-based industries agriculture planning alternative crops Andhra Pradesh Development Andhra Pradesh vision plan Ap News in Telugu Breaking News in Telugu eco-tourism family adoption scheme GMR Airport Google News in Telugu intercropping Kondapalli Srinivas Latest News in Telugu mango cluster mapping MSME P4 initiative Paper Telugu News poverty-free state rural tourism Sun Ray Resorts Swarna Andhra 2047 Tatipudi reservoir Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Tourism Development vangalapudi anitha Vizianagaram district

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.