Andhra Pradesh: వైకాపా కౌన్సిల్ సభ్యుల తీరు, చైర్మన్ ఏకపక్ష ధోరణి బాధాకరం

Read Time:  1 min
Andhra Pradesh: వైకాపా కౌన్సిల్ సభ్యుల తీరు, చైర్మన్ ఏకపక్ష ధోరణి బాధాకరం
FONT SIZE
GET APP

ప్రభుత్వ విప్ పంచుమర్తి అనురాధ

Andhra Pradesh: గత కొన్ని రోజులుగా కౌన్సిల్లో వైసీపీ (YCP) సభ్యులు ఏ రకమైన నాటకాలు ఆడుతూ ప్రభుత్వం చెప్పే సమాధానాలు వినకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సెషన్స్ అన్నీ కూడా వాళ్ళు తీసి పక్కన పెడుతూ సబ్జెక్టు దారి మళ్ళిస్తున్నారని తెలిపారు. తిరుపతి కల్తీ లడ్డూ పైన షార్ట్ డిస్కషన్స్ జరగాల్సి ఉంది ప్రభుత్వం తరపున దేవదాయ శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. మంత్రి స్టేట్మెంట్ కాపీలు 150తయారుచేసి సభ్యులకు ఇవ్వండి అని చెప్పి చైర్మన్ నోటిస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు ముందు వైసీసీ సభ్యులు మాట్లాడాతారు అని మంత్రిని అవమానించే విధంగా ప్రభుత్వాన్ని అవమానించే విధంగా వైసీపీ సభ్యుల ప్రవర్తన దానికి చైర్మన్ చప్పట్లు కొట్టారు.

Read Also: Nara Lokesh: లోకేష్ ఉదారతపై జాన్వీ కపూర్ ప్రశంసలు

Andhra Pradesh: వైకాపా కౌన్సిల్ సభ్యుల తీరు, చైర్మన్ ఏకపక్ష ధోరణి బాధాకరం
Andhra Pradesh: The behavior of the YSRCP council members and the unilateral attitude of the chairman are painful.

సోము వీర్రాజుపై దాడి

క్వశ్చన్ హవర్ కూడా వన్ అండ్ హాఫ్ చేసిన చైర్మన్, పనికట్టుకొని వాయిదాల మీద వాయిదాలువేస్తూ క్వశ్చన్ హవర్ కూడా జరగనివ్వకుండా చేశారు. కౌన్సిల్లో ఓ పెద్దాయన బిజేపిలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, బిజేపి రాష్ట్ర ప్రెసిడెంట్గా పనిచేసిన సోము వీర్రాజు కి ఒక స్టేటస్ ఉంది. ఆయన క్వశ్చన్ హవర్ జరిపించండి అని చైర్మన్ అడిగిన ఆయనపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. చేతులు జోడించి చైర్మన్ ని ఆయన అడగడం మాకే బాధ అనిపించింది. ఇంత పెద్దాయన ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఈ వైసీపి సభ్యులు తీసుకొచ్చారు.

జగన్ తీరుపై విమర్శలు

తిరుపతి లడ్డూ కల్తీల విషయం మీద మేము వెనక్కి వెళ్ళే ప్రసక్తేలేదు ప్రభుత్వం తరపున ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. ఒకటి కాదు రెండు కాదు ఐదారు సార్లు కౌన్సిల్లో చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. దేవాలయాల్లో కల్తీ నెయ్యితో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రవర్తించింది. బయట మార్కెట్లో కిలో ఆవునెయ్యి దాదాపు రూ.2000లు ఉంది, అలాంటిది కేవలం కిలో రూ.329లకే కొన్నారంటే అది ఖచ్చితంగా కల్తీ నెయ్యేనని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రభుత్వం అన్ని దేవాలయాలకు ఒక నిర్దిష్ట ధరకు నెయ్యి కొని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిన్న పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నందిపల్లిలోని శ్రీనందీశ్వరాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడి పూజారి ఇచ్చినటువంటి తీర్ధాన్ని స్వీకరించకుండా కిందకి వదిలేయడం అదేవిధంగా గోత్రనామాలు చెప్పకుండా అవహేళన చేయడం అగ్ని గుండంలో వేయాల్సి నటువంటి వస్తువుల్ని తిరిగి మళ్ళీ పూజారికి ఇవ్వడం జరిగింది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.