Andhra Pradesh: రేపటికి వాయిదా పడ్డ ఏపీ శాసనమండలి

Read Time:  1 min
Andhra Pradesh: రేపటికి వాయిదా పడ్డ ఏపీ శాసనమండలి
FONT SIZE
GET APP

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఈ లోపు సభలో చేపట్టాల్సిన అంశాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది.

బీఏసీ నిర్ణయం ప్రకారం, మంగళవారం మండలిలో రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ అంశంపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, పోలీసుల పనితీరుపై ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Read Also: P4Scheme: పి-4 పథకంలో లబ్ధిదారుడికి సిఎన్‌జీ ఆటో పంపిణీ

Andhra Pradesh: రేపటికి వాయిదా పడ్డ ఏపీ శాసనమండలి

కీలక అంశాల పై చర్చ

నవంబర్ 25 రాష్ట్రంలోని వ్యవసాయ రంగం, రైతుల సమస్యలపై, నవంబర్ 26 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల కల్తీ లడ్డూ అంశంపై ప్రత్యేక చర్చ. ఈ ప్రధాన అంశాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, ఇరిగేషన్, ఎడ్యుకేషన్ వంటి ముఖ్యమైన విషయాలపై చర్చలు చేపట్టాలని నిర్ణయించారు.

ముఖ్యంగా తిరుమల లడ్డూ, శాంతిభద్రతల అంశాలపై ప్రభుత్వం (AP Government) తన వాదనను బలంగా వినిపించాలని చూస్తోంది. అదే సమయంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి ఈ వారం శాసన మండలి సమావేశాలు అత్యంత ఆసక్తికరంగా సాగనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.