📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఓ రోడ్డు ప్రమాదంలో ఊడిన డ్రైవర్ ఉద్యోగం

Author Icon By Anusha
Updated: June 10, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో కాల్ ఆన్ డ్యూటీగా పనిచేస్తున్న ఓ డ్రైవర్ అనుకోని సంఘటన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.డ్రైవర్ నడుపుతున్న బస్సు వెనుక టైర్ కింద ఓ వ్యక్తి చనిపోయారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంతో డ్రైవర్‌ను విధుల నుంచి తప్పించారు. అయితే సీసీ ఫుటేజ్‌ను బట్టి డ్రైవర్‌ తప్పులేదని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. కానీ కేసు నమోదు కావడంతో ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో డ్రైవర్ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)ను రిక్వెస్ట్ చేస్తూ తన సమస్యను వివరించారు.మంత్రి లోకేష్‌కు ఈ విధముగా సమస్యను వివరించారు,గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి అయ్యా GSKD ప్రసాద్ అనే నేను ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ఆన్ కాల్ డ్రైవర్ గా గత ఆరేళ్లుగా పని చేస్తూ AP05Z 5275 (అమలాపురం to విజయవాడ) బస్ నడుపుతున్న సమయంలో,ఒక వ్యక్తి కొత్తపేట బస్టాండ్ దగ్గర బస్సు వెనక టైర్ల కిందపడి చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చాలా స్పష్టంగా ఉన్నా కూడా పోలీసులు ఎలాంటి విచారణ జరపకుండా కేవలం ఫిర్యాదు మేరకు FIR (116/2025) 19-05-2025 తేదీన నమోదు చేశారు. నా తప్పిదం లేని ప్రమాదానికి నన్ను బాధ్యుడిని చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వలన నన్ను విధుల నుండి తొలగించారు. ప్రమాదం తాలూకా వాస్తవాలను సిసి ఫుటేజిలను సేకరించి డిపో మేనేజర్ గారు విచారించి జరిగిన వాస్తవం తెలుసుకున్నారు. అయితే పోలీసులు సహకరించనందున నాకు డ్యూటీలు ఇవ్వడం లేదు’ అన్నారు.

నా కుటుంబానికి

దీంతో పేద కుటుంబానికి చెందిన నాకు తీరని అన్యాయం జరిగింది. నా తప్పు లేకపోయినా, నా డ్రైవింగ్ లైసెన్సు రద్దు కాకపోయినా విధులనుండి తొలగించినారు. దయచేసి తక్షణమే నాకు న్యాయం చేయకపోతే నా కుటుంబానికి జీవనోపాధి దూరం అవుతుంది. నా తప్పు లేకపోయినా నాకు శిక్ష వేయడం న్యాయం కాదు. దయచేసి నాకు నా కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మిమ్మలను ప్రార్థిస్తున్నాను. దయచేసి రెగ్యులర్ డ్రైవర్ కు క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా అమలు చేస్తారో అదేవిధంగా నాకు అమలు చేసి నన్ను విధులలోకి తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

వివరించడంతో

ఈ విషయంలో ఆర్టీసీ అధికారులు సానుకూలంగా ఉన్నా పోలీసుల కారణంగా తన ఉద్యోగానికి ఇబ్బంది ఎదురవుతోందన్నారు డ్రైవర్ ప్రసాద్(Driver Prasad). మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు.డ్రైవర్ సమస్యను వివరించడంతో పాటుగా ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను కూడా ట్వీట్ చేశారు. అందులో ఓ వ్యక్తి రోడ్డు పక్క నుంచి వచ్చి బస్సు టైర్ కిందకు వచ్చి పడటం కనిపించింది.

Read Also: AP Congress: ఏపీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు

#AccidentalDeath #APSRTC #BusDriverIssue #CallOnDriver #JusticeForDriver Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.