ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి(Anakapalli) జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది.ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు చనిపోగా ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిని పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్ – తెలంగాణ), సరగడం కుమార్ (సేఫ్టీ ఆఫీసర్ – మునగపాక, అనకాపల్లి)గా గుర్తించారు. బైడూ భైసాల్ (ఒడిశా) అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.పరవాడ ఫార్మాసిటీ(Paravada Pharmacity)లోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
అస్వస్థత
కంపెనీలో ఉన్న రసాయన వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ దగ్గర లెవల్స్ చెక్ చేయడానికి ముగ్గురు ఉద్యోగులు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం రాగానే పరవాడ సీఐ, పోలీస్ సిబ్బంది ప్రమాద స్థలానికి వెళ్లారు. చనిపోయిన ఇద్దరు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Talliki Vandanam Scheme : తల్లికి వందనంలో చేతికందేది 2వేలే