हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Agreement : ఈ ఒప్పందం ఉభయ తారకమేనా?

Sudha

ట్రంప్ మనసు మారింది. భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయనే ముందడుగు వేసి తానే ప్రసన్నమయ్యా రు. ఇంతకు ముందు భారత్పై అక్కసుతో వేసిన ప్రతీకార సుంకాలను తగ్గించారు. భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గించడం విశేషం. తన భారత్ ప్రధానికి మధ్య జరిగిన ఒప్పంద విశే షాలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షు డు ట్రంప్ సొంత ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. వీరి సంభాషణల పర్యవసానంగా అమెరికా ఉత్పత్తులపై భారత్ వసూలు చేస్తున్న సుంకాలు దశలవారీగా ‘సున్నా’ కు తగ్గిస్తామని హామీ లభించింది. ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల మధ్య సానుకూల వైఖరితో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి (Agreement)ముందడుగు పడింది. అమెరికా నుండి భారత్ సాలీనా రూ.45.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటోంది. వీటిపై సుంకాలు లేకుండా చేయాలని, అప్పుడే భారత్మార్కె ట్లో అమెరికా ఉత్పత్తుల విక్రయాలు పుంజుకోగలవని ట్రంప్ ఆశ. అది నెరవేరినట్లే ఉంది. ఈ వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఇరు దేశాల అగ్రనేతలూ ఒకరినొకరు పరస్పరం అభినందించుకున్నారు. 140కోట్ల మంది భారతీయు ల తరపున ట్రంప్కు ప్రధాని మోడీ హృదయ పూర్వక అభినందనలు తెలియచేస్తే, ట్రంప్ కూడా తనకు మోడీ తో ఉన్న స్నేహభిలాషను సైతం వ్యక్తం చేశారు. ప్రపం చంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు కలిసి పనిచేస్తూ అద్భుతమైన మేలు ఆయా దేశాల ప్రజలకు కలుగుతోందని, పరస్పర ప్రయోజనాలకు మార్గం సుగమం చేస్తుందని భారత ప్రధాని అంటున్నారు. ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నేతృత్వం అవసరమనీ పొగిడారు. ఒకపక్క ట్రంప్ రష్యా, ఉక్రె యిన్, ఇరాన్, ఇజ్రాయెల్, వంటి దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో వైరుధ్య భావనలతో వ్యవహరి స్తున్నా భారత్ మాత్రం చాణక్యనీతిలో ఆయన శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మద్దతు ప్రకటించింది. భారత్ వాణిజ్య ఒప్పందం వేళ, ట్రంప్, రష్యాతో వ్యాపార నిరోధకతపై భారత్పై ఒత్తిడి తెచ్చారు. అందువల్లనే భారత్ అమెరికాల మధ్య ఒప్పందానికి (Agreement)వీలుపడినట్లు భావించాల్సి వస్తోంది. రష్యా చమురు ఇండియా కొన కూడదని అమెరికా ఆంక్ష. తమ వ్యవసాయ ప్రయోజ నాలకు భంగకరమైన ఎలాంటి షరతులను తాము అంగీ కరించబోమని భారత్ఇన్నాళ్లూ భీష్మించుకు కూర్చొంది. కానీ ఇప్పుడా ఒప్పందం జరిగిందనీ, ఇరుదేశాలూ పరస్ప రం సంతోషం వ్యక్తం చేశారంటే వాటి విషయంలో రాజీపడి వెనక్కితగ్గారా! అనే అంశాలపై పూర్తి స్పష్టతరావాల్సి ఉంది. రష్యా చమురు కొనుగోలు నిలిపి వేసి అమెరికా, వెనెజులా నుంచి చమురు కొనుగోళ్లు చేసే విషయమై ప్రధాని మోడీ సానుకూల వైఖరితో ఉన్నారని ట్రంప్ తన సోషల్ మీడియాలో సుదీర్ఘ సందేశాన్ని ఉంచారు. రష్యా చమురు కొనుగోలు ద్వారా భారత్ రష్యాఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి ఆర్థికంగా తోడ్పడుతోందని ఆది నుంచీ భారత్ మీద ఆరోపణలు గుప్పిస్తున్న ట్రంప్ మాత్రం ఇప్పుడు తనప్రకటనలో తాజా నిర్ణయాలు ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేందుకు తోడ్పడతాయంటూహర్షం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే వాటిలో బొగ్గు, సాంకేతికత వ్యవసాయ ఇతర ఉత్పత్తులున్నట్లు, అందుకు భారత్ ప్రధాని నుంచి హామీ తీసుకున్నట్లు ట్రంప్ చెబు తున్నారు. ఈ ఒప్పందంలో ఎవరివలన ఎవరికి ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో, ఏ దేశ వాణిజ్యానికి ఎంతవరకు లాభం కలిగిందో ప్రభుత్వమే ప్రకటిస్తే తప్ప సామాన్య ప్రజానీకానికి అర్థంకాదు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ఇక ఆకాశమే హద్దుఅని అమెరికా రాయబారి సెర్గియోగోర్ ఈ డీల్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. టెక్స్ టైల్, ఫార్మా షేర్లు దూసుకుపోతు న్నాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పెరిగింది. ఈ ఒప్పందాన్ని ట్రంప్ మార్కు ‘ఆర్ట్ ఆఫ్ డీల్గా గ్లోబల్ సప్లై చైన్లో భారత్ను తిరుగులేని శక్తిగా మారుస్తుందని విదేశీ పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. ట్రంప్ మార్కు సుంకాల యుద్ధానికి, దౌత్యపరమైన ఉద్రి క్తతలను ఈ ఒప్పందం ముగింపు పలుకుతుందని మరి కొన్ని విదేశీ పత్రికలు విశ్లే షిస్తున్నాయి. ఈ ఒప్పందంలో భారత్లో టెక్ హార్డ్వేర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ల్యాప్టాప్లు, కన్జూమర్ఎలక్ట్రానిక్స్, ఇతర గ్యాడ్జెట్లు చౌకగాలభించే అవకాశముంది. ప్యాకేజ్ గూడ్స్, ప్రొసెస్ , గృహోపకరణాల దిగుమతి ఖర్చులు తగ్గుతాయి కనుక వాటి ధరలు కూడా సరసమైనవిగా ఉంటాయి. పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులువంటి వ్యవ సాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గుతాయి. భార తీయ వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలకు అమెరికా లో ఎగుమతుల వలన విక్రయాల స్థాయి పెరుగుతుంది. భారత్నుంచి భారీగా ఎగుమతయ్యే రత్నాలు ఆభరణాల రంగానికి లాభసాటికానుంది. ప్రధాని ఆలోచనల ప్రకారం విదేశాల్లో కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’కు కొత్త ఊపు రానుంది. గతయేడాది ద్వితీయార్థంలో ట్రంప్ అవలంబిం చిన సుంకాల వడ్డన ప్రభావంతో చిన్న, మధ్యతరహా పరిశ్ర మల రంగంభారీగా దెబ్బతింది. ఈ దశలో అమెరికాతో ఒప్పందం ఖరారైన వేళ మళ్లీ పరిశ్రమల రంగం పుంజు కునే అవకాశంఉంది. ఇంతవరకు ఏకపక్షంగా ట్రంపన్నుంచి మాత్రమే ఒప్పంద విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా భారత్ ఒప్పంద వివరాలపై ఇచ్చిన క్లారిటీచూస్తే మరోల ఉంది. వ్యవసాయ ప్రయోజనాలకు ఇబ్బందికర మైన ఏ షరతును తాము పాటించబోమని ఇండియా స్పష్టంగా ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870