📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

TTD: టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలు..కోర్సులు, అర్హతల వివరాలు ఇవే

Author Icon By Anusha
Updated: May 17, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమల శ్రీవారి ఆశీస్సులతో టీటీడీ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతోంది.అలాగే విద్యా సంస్థల ద్వారా చదువును అందిస్తోంది. ఈ క్రమంలో టీటీడీ తిరుమల సహా మిగిలిన వేద పాఠశాలలో ప్రవేశాలకు 2025 -26 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. టీటీడీ(TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములు (పాఠశాలలు) 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, 3. విజయనగరం, 4. ఐ. భీమవరం, 5. నల్గొండ, 6. కోటప్పకొండ నందు బోధింపబడు వివిధ కోర్సుల్లో ప్రవేశం కొరకు అర్హులైన బాలుర నుంచి అనగా వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి, నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కలిగిన వారి నుండి టీటీడీ దరఖాస్తులు కోరింది.సదరు పాఠశాలల యందు బోధింపబడు వివిధ కోర్సుల వివరాలు, అర్హత, ఆవశ్యకత, దరఖాస్తు. ఇతర వివరాలకు టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org నందు తిలకించవచ్చును. 2025 మే 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని టీటీడీ ప్రకటనలో తెలిపింది. వేద సంబంధిత కోర్సులకు నిర్దేశించిన ప్రకారం వయసు, విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు ఫారాన్ని నింపి తాము చేరదలచుకొన్న వేద విజ్ఞాన పీఠానికి పంపాల్సి ఉంటుంది.

TTD: టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలు..కోర్సులు, అర్హతల వివరాలు ఇవే

అర్హతలు

‘రుగ్వేదం(శాకల శాఖ), శుక్ల యజుర్వుదం (కాణ్వ శాఖ), కృష్ణ యజుర్వేదం(తైత్తిరీయ శాఖ), సామవేదం (కౌథుమ శాఖ), సామవేదం(జైమినీయ శాఖ), సామవేదం (రాణాయనీయ శాఖ) కోర్సు వ్యవధి 12 ఏళ్లు. కృష్ణ యజుర్వేదం(మైత్రయనీయ శాఖ), అథర్వణ వేదం(శౌనక శాఖ) కోర్సుల వ్యవధి ఏడేళ్లు. వీటికి ఐదోతరగతి ఉత్తీర్ణులైన బాలురు అప్లయ్‌ చేసుకోవచ్చు.వయసు పది నుంచి పన్నెండేళ్ల మధ్య ఉండాలి. దివ్య ప్రబందం, వైఖానసాగమం, పాంచరాత్రాగమం, చాట్టాడ శ్రీ వైష్ణవ ఆగమం, శైవాగమం, తంత్రసార ఆగమం, రుగ్వేద స్మార్తం(అస్వలాయన), శుక్ల యజుర్వేద స్మార్తం (పారస్కర), కృష్ణయజుర్వేద స్మార్తం(ఆపస్తంబ), వైఖానస స్మార్తం, ఆపస్తంబ పౌరోహిత్యం(స్మార్తం), బోదయన పౌరోహిత్యం (స్మార్తం) కోర్సుల వ్యవధి ఎనిమిదేళ్లు కనీసం ఏడోతరగతి ఉత్తీర్ణులు ఈ కోర్సులకు అప్లయ్‌ చేసుకోవచ్చు వయసు 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండాలి’ అని టీటీడీ తెలిపింది.ఎస్‌.వి.వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల,ఎస్‌.వి. వేద పాఠశాల, శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, కోటప్పకొండ, గురవాయపాలెం పోస్టు, వయా సాతులూరు, నర్సరావుపేట, గుంటూరు జిల్లా,
ఎస్‌.వి. వేద పాఠశాల, ఐ.భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా,ఎస్‌.వి. వేద పాఠశాల, శ్రీమత రామాయణ ప్రాంగణం, రామనారాయణ సారిక దగ్గర, విజయనగరం(Vijayanagaram) జిల్లా,ఎస్‌.వి. సంస్కృత వేద పాఠశాల, కీసరగుట్ట, మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లా,ఎస్‌.వి. వేద పాఠశాల, ఎ.యం.ఆర్‌.ఎస్.ఎల్‌.బీ.సీ క్యాంపస్‌, పానగల్‌, రామగిరి, నల్గొండ జిల్లా.

Read Also : CM Chandrababu : నేడు కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన

#SpiritualLearning #ttd #TTDAdmissions2025 #VedaPathashala #VedicEducation Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.