📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Space Park: మరో 2 స్పేస్ పార్కులు

Author Icon By Vanipushpa
Updated: June 16, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీవారి కోట, లేపాక్షి వద్ద ఏర్పాటు యోచన

విజయవాడ: రాష్ట్రంలో మరో 2 చోట్ల అంతరిక్ష పార్కుల ఏర్పాటుదిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సిఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేసారు. రాష్ట్రంలో అంతరిక్షపార్కులు ఇతర అంశాలపై భవిష్యత్తు కార్యచరణపై సిఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ‘ఎక్స్’ (X) వేదికగా సమాచారాన్ని వెల్లడించారు. సిఎంవోనుండి అంతరిక్షపార్కులుపై స్పష్టత నిస్తున్న ప్రకటన విడుదలయింది. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రం ఉన్న శ్రీహరికోట(Sriharikota) సమీపంలోనే ఒక పార్కు, అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో మరోక పార్కు ఏర్పాటు చేయాలనిచూస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకునే ఇస్రో మాజీ అధిపతి డాక్టర్ సోమనాథ్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే అంతరిక్ష రంగంపై ప్రభుత్వం అడుగులు వేస్తుంది. శ్రీహరికోట దగ్గర్లో వాహక నౌకలతోపాటు కీలకమైన ప్రొపెలెంట్ లాజిస్టిక్ తయారీ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లేపాక్షి వద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతరిక్ష పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు.

Space Park: మరో 2 స్పేస్ పార్కులు

దేశంలోనే ఏకైక స్పేస్ పోర్టు ఉన్న ఆంధ్రప్రదేశ్
శ్రీసిటీలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన విఆర్వి (స్వదేశీ ద్రవ హైడ్రోజన్ నిల్వ ట్యాంక్), డానియేల్ ఇండియా (మొబైల్ లాంచ్ పెడెస్టల్స్ బిల్డర్లు), రోటోలోక్ (ఘన ఇంధన ఇంజిన్ల కోసం వాల్వులు), టిహెచ్కే ఇండియా (చంద్రయాన్3లో వినియోగించిన లీనియర్ మోషన్ గైడ్లు), నోవాఎయిర్ (ద్రవ ఆక్సిజన్ సరఫరా), వాల్ మెట్ ఇంజినీరింగ్ (ఏరోస్పేస్ గ్రేడ్ మిశ్రమ లోహాల ప్రాసెసర్లు), సిద్ధార్థ లాజిస్టిక్స్ (సున్నితమైన ఇస్రో పేలోడ్
లాజిస్టిక్ లు) సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రా షుగర్స్ ప్రొపెలెంట్ యూనిట్ ఉంది. వీరు ఇస్రోకు ఎప్పటి నుంచో రాకెట్ ఇంధనం (ఎంఎంహెచ్, యూడీఎంహెచ్) ను సరఫరా చేస్తున్నారు. తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు తమ సొంత అంతరిక్ష పాలసీల రూప కల్పనలో ముందు వరుసలో ఉన్నాయి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్స్పెస్) కూడా అక్కడ వాహకనౌకలు, ఉపగ్రహాలు, పరికరాల తయారీపై దృష్టి పెట్టాయి. గుజరాత్ ఉపగ్రహాలు, పేలోడ్లపై, తమిళనాడు వాహకనౌకలపై దృష్టి పెట్టాయి. కర్ణాటక ఇప్పటికే ఇస్రోకు సంబంధించిన కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. దేశంలోనే ఏకైక స్పేస్ పోర్టు ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం చంద్రబాబు
అందుకే సిఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నూతన పాలసీతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం. అంతరిక్ష కేంద్రం ఉన్న శ్రీహరికోట సమీపంలోనే ఒక పార్కు, అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో మరోక పార్కు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకునే ఇస్రో మాజీ అధిపతి డాక్టర్ సోమనాథ్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే అంతరిక్ష రంగంపై ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
శ్రీహరికోట దగ్గర్లో వాహక నౌకలతోపాటు కీలకమైన ప్రొపెలెంట్ లాజిస్టిక్ తయారీ చేపట్టా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. లేపాక్షివద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతరిక్ష పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం ఉన్నప్పటికీ దానికి కావాల్సిన సామగ్రి తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. అక్కడ నుంచి శ్రీహరికోటకు తీసుకొచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఇంకా దీనివల్ల ప్రయోగాలు ఆలస్యం అవుతున్నాయి. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోనే అంతరిక్ష పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకు కేంద్రం నుంచి సానుకూలత లభించిందన్నారు. దేశంలోని టాప్ 3 స్టీల్ పరిశ్రమలతో స్టీల్ హబ్గా తీర్చిదిద్దడం, అలాగే పెట్రో కెమికల్స్, గ్యాస్ట్రోడ్, పోర్టుల అభివృద్ధి, పెట్రోకెమికల్స్ మెడికల్ టెక్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ టెక్, లేబర్ ఇంటెన్సివ్ మాన్యుఫాక్చరింగ్పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పన
వచ్చే 7 ఏళ్లలో ఐటీ రంగంలో కనీసం 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం లక్ష్యంగా నిర్దేశించారు. డేటా సెంటర్లు, స్టార్టప్లు ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 4 రైల్వే ప్రాజెక్టులతో పాటు అదనంగా 2032 కల్లా మరో 7 కొత్త రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయనున్నారు. తమది కూటమి ప్రభుత్వమైనా పరిమితులేం లేవని, ఒకే మాట మీద ముందుకెళుతున్నామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎంత ముఖ్యమో, అరాచకాల్ని అడ్డుకోవడమూ అంతే ముఖ్యమని చెప్పారు. ఎంతో బాధ్యతగా మంచి పనులు చేస్తున్నామని, కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని తెలిపారు. అదేవిధంగా అమరావతి పనుల్ని గాడిలో పెట్టామని, రూ.11,000 కోట్ల కేంద్రసాయం తెచ్చి, విశాఖ ఉక్కును నిలబెట్టామన్నారు. అవన్నీ కూటమి ప్రభుత్వం వల్లే జరిగాయన్న విషయాన్ని గుర్తించాలని, వాటిని పట్టించుకోకుండా ఇంకా ఏమీ చేయట్లేదంటే ఎలా అని ప్రశ్నించారు. కూటమిలో మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయి వరకూ సమస్యలు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు.
న్యుఫాక్చరింగ్ నోడ్స్, పోర్టులకు అనుకూలించేలా కొత్తగా 9 రోడ్డు ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఎవరి విద్యుత్ వాళ్లే ఉత్పత్తి చేసుకుంటే విద్యుత్ సరఫరా నష్టాలు అనేవి ఉండవని సిఎం అభిప్రాయపడ్డారు. ఇవి వాహనాలకు అందరూ మళ్లితే రవాణా ఖర్చులు కూడా పూర్తిగా తగ్గిపోతాయన్నారు. సోలార్, విండ్ పవర్తో పాటు పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ఇందుకుతగ్గ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆశయం నెరవేరేందుకు నీతి ఆయోగ్ సహకారం కూడా కోరారు.

Read Also: Godavari: కృష్ణా రిజర్వాయర్లకు జలకళ

#telugu News 2 more space parks Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.