“గేమ్ చేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌..ఇద్దరు యువకుల మృతి

Read Time:  1 min
bike accident
bike accident
FONT SIZE
GET APP

అప్పటివరకు ఎంతో హ్యాపీగా వున్న వారిద్దరూ విగతజీవులుగా మారిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగిల్చారు. ఎంతో భవిష్యత్తు వున్నవారు కనుమరుగై పోయారు. ఎదురుగా వచ్చిన వ్యాన్ వారి బైకును బలంగా ఢీకొట్టింది. దీనితో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) శనివారం రాజమహేంద్రవరంలోని వేమగిరిలో జరిగిన రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ కోసం బైక్‌పై వచ్చారు. అయితే, అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో తిరిగి కాకినాడ బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి 9.30 గంటల సమయంలో వడిశలేరులో ఎదురుగా వచ్చిన వ్యాన్ వారి బైకును బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే 108 వాహనంలో పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంసభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.