ధోని పై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు

ధోని పై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ బిర్యానీ ప్రేమ గురించి, అలాగే క్రికెట్‌లో పీఆర్ హైప్ వల్ల ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

Advertisements

బిర్యానీ కోసం హోటల్ మార్చుకున్న సంఘటన

2014 ఐపీఎల్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చింది. టీమిండియా క్రికెటర్లు ధోనీ, సురేశ్ రైనా హైదరాబాద్ లోని ప్రసిద్ధ దమ్ బిర్యానీ ను తినాలనుకున్నారు. అంబటి రాయుడు తన ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన బిర్యానీని హోటల్‌కు పంపించారు. అయితే, హోటల్ సిబ్బంది “బయట ఫుడ్ అనుమతిలేదు” అంటూ బిర్యానీని తిరస్కరించారు.ఈ విషయం ధోనీకి తెలియడంతో, ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, వెంటనే ఆ హోటల్‌ను మార్పించుకున్నారు. అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఆ హోటల్‌లో బస చేయడం మానేశారు. ఈ సంఘటనతో ధోనీ హైదరాబాద్ బిర్యానీపై ఉన్న ప్రేమ, అలాగే తనకు నచ్చిన దానిని సాధించుకునే ధోరణి మరోసారి స్పష్టమైంది.

క్రికెట్‌లో పీఆర్ హైప్‌పై రాయుడు విమర్శలు

అంతేకాదు, రాయుడు ప్రస్తుత క్రికెట్‌లో పీఆర్‌ల ప్రభావం ఎక్కువైందని ఆరోపించారు. గతంలో నిజమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు మాత్రమే గుర్తింపు పొందేవారని, కానీ ఇప్పుడు పీఆర్ మేనేజ్‌మెంట్‌ల ద్వారా కొన్ని పేర్లు ఊచకోత కోస్తున్నాయని అన్నారు. కొందరు ఆటగాళ్లు తక్కువ ప్రదర్శన ఇచ్చినా, పెద్ద ఎలివేషన్ పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.”ఇప్పుడు ఆటను కన్నా, పీఆర్‌ల హైప్ ఎక్కువైందని,నిజమైన టాలెంట్‌కు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది.” అని రాయుడు అభిప్రాయపడ్డారు.

3789ebbc ambati rayudu and ms dhoni

రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని క్రికెట్ విశ్లేషకులు “రాయుడు చెప్పింది నిజమే” అని ఒప్పుకుంటే, మరికొందరు ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తేల్చారు. ఏదేమైనా, ధోనీ హైదరాబాద్ బిర్యానీ ప్రేమ, అలాగే క్రికెట్‌లో పీఆర్ హైప్ అనే అంశాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.కొంతమంది ఆటగాళ్లు తక్కువ ఆడినా పెద్ద ఎలెవేషన్ తీసుకుంటున్నారని విమర్శించాడు. గతంలో ఇది ఇలా ఉండేదికాదని, ఇప్పుడు మాత్రం అసలు టాలెంట్‌కు అవకాశం లేకుండా మారిందని చెప్పాడు. ఈ నేపథ్యంలో క్రికెట్‌లో పీఆర్‌ల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని రాయుడు డిమాండ్ చేశాడు.

Related Posts
IND vs NZ: సచిన్‌, కోహ్లికే సాధ్యం కానీ ఘనత.. చరిత్ర సృష్టించిన జైస్వాల్!
yashasvi jaiswal 31 1729841605

భారత యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ క్రికెట్ ప్రపంచంలో అరుదైన ఘనతను సాధించాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలకు సాధ్యం కాని ఘనతను ఆయన అందుకున్నాడు. యశస్వీ, Read more

మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్..
vaibhav suryavanchi

విజయ్ హజారే ట్రోఫీ 2024లో బీహార్ వర్సెస్ మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక ఘనతను అందించింది.13 ఏళ్ల కుర్రాడైన Read more

ఇటీవ‌ల మ‌రింత క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం
vinod kambli

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత విషమించడంతో,అతని కుటుంబ సభ్యులు శనివారం నాడు థానేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల Read more

 స్వదేశంలో 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురయ్యే అవకాశం ఉంది
rohit sharma test 1

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో, భారత్ 0-2 తేడాతో పరాజయం పాలైంది. ఈ ఫలితంతో, భారత జట్టు 12 ఏళ్ల తర్వాత తన Read more

×