దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభకు వచ్చింది. కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు- దీన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చను మొదలుపెట్టారు. కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ఈ 31 మందిలో తెలంగాణ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, డీకే అరుణ, ఏపీ నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, విజయసాయి రెడ్డి సభ్యులుగా కొనసాగారు. ఆ తరువాత సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ కమిటీ ఇప్పటివరకు 284 మందితో చర్చలు జరిపింది. ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో సమావేశమైంది. ప్రజాభిప్రాయాలను సేకరించింది. ముస్లిం మత పెద్దలతో భేటీ అయింది. అలాగే- మూడుసార్లు స్టడీ టూర్లనూ నిర్వహించింది.

ఆందోళన వ్యక్తం
ఈ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఘాటుగా స్పందించింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదని డిమాండ్ చేసింది. దీన్ని తాము వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేసింది. వక్ఫ్ ప్రయోజనాలు, ఉద్దేశాలకు విఘాతంలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మహమ్మద్ ఫజల్-వుర్- రహీం ముజాద్దిదీ, అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇల్యాస్ మాట్లాడారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించిన సవరణలు వక్ఫ్ బిల్లును మరింత క్లిష్టంగా మార్చాయని అన్నారు. జేపీసీ మోసపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు గానీ, వివిధ రాష్ట్రాల మైనారిటీ కమిషన్లు, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల అభ్యంతరాలను జేపీసీ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే.. తాము చూస్తూ కూర్చోబోమని తేల్చి చెప్పారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఖాసిం రసూల్ ఇల్యాస్ అన్నారు.