ఒక్క గులాబీ మొక్క ఖరీదే రూ.12లక్షలు- ఎక్కడంటే!

Rose plant: ఒక్క గులాబీ మొక్క ఖరీదు రూ.12లక్షలు- ఎక్కడంటే!

తమిళనాడుకు చెందిన ఓ రైతు ఎడారి గులాబీ మొక్కలను పెంచుతూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఏటా రూ.50లక్షలు నుంచి రూ.60 లక్షల ఆదాయాన్ని అర్జిస్తున్నారు. ఒక్కో మొక్కను రూ.12లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అసలు ఎడారి గులాబీ మొక్కకు ఎందుకు అంత ధర? రైతు మొక్కల సాగులో అవలంభిస్తున్న విధానాలు ఏంటో మీరు చదవండి.

Advertisements
ఒక్క గులాబీ మొక్క ఖరీదే రూ.12లక్షలు- ఎక్కడంటే!

40 ఏళ్ల క్రితం సాగు ప్రారంభం
తిరువల్లూర్​లోని ఈసనమ్ కుప్పంకు చెందిన జలంధర్ అనే రైతు 40 ఏళ్ల క్రితం ఎడారి గులాబీ మొక్కల సాగును ప్రారంభించారు. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొక్కలను పెంచుతున్నారు. మొత్తం 450 రకాల మొక్కలను సాగు చేస్తున్నాడు. ప్రతి ఎడారి గులాబీ మొక్క మూడు వేర్వేరు రకాల పువ్వులను పూస్తోంది.
‘రూ.12 లక్షలకు ఒక మొక్క అమ్మకం’
“చిన్న వేర్లు ఉన్న మొక్కలు రూ.150కు అమ్ముతాం
. మందపాటి వేర్లు ఉన్నవి రూ. 12 లక్షల వరకు అమ్ముడుపోతాయి. ఈ ఎడారి గులాబీ మొక్కలు ప్రపంచంలోని మూడు ప్రదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చెన్నై, వియత్నాం, థాయిలాండ్​లో మాత్రమే లభిస్తాయి. రూ.12 లక్షలకు అమ్ముడయ్యే మందపాటి వేర్లు కలిగిన ఎత్తైన మొక్కలు చెన్నైలో దొరుకుతాయి. మొక్కలు నాటిన మొదటి 20 ఏళ్లు ఎటువంటి లాభాలు లేవని తెలిపారు. తాను పెంచిన మొక్కలు కేరళ, గుజరాత్, దిల్లీ వంటి రాష్ట్రాలకు, దుబాయ్ వంటి అరబ్ దేశాలకు ఎగుమతి అవుతాయని పేర్కొన్నారు.”అంటుకట్టడం ద్వారా ఒకే మొక్కపై బహుళ వర్ణ పువ్వులు వికసిస్తాయి. నేను ప్రస్తుతం ఎడారి గులాబీ మొక్కల పెంపకం ద్వారా ఏటా రూ. 50- రూ. 60 లక్షల వరకు సంపాదిస్తున్నాను. వీటి పెంపకానికి ఎక్కువ నీరు అవసరం లేదు అని రైతు జలంధర్ చెప్పారు.

Related Posts
అంబర్పేట నియోజకవర్గం లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: అంబర్పేట నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ పర్యటన జరిగింది. బాగ్ అంబర్పేట్, నల్లకుంట, బర్కత్‌పుర ప్రాంతాల్లో రూ.4.90 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో Read more

Bhattacharya: శాస్త్రవేత్త జే భట్టాచార్య NIH డైరెక్టర్‌గా నియమితం
శాస్త్రవేత్త జే భట్టాచార్య NIH డైరెక్టర్‌గా నియమితం

అమెరికాలోని ప్రముఖ ఆరోగ్య పరిశోధనా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) డైరెక్టర్‌గా భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ జే భట్టాచార్య నియమితులయ్యారు. ఆయన నియామతను US Read more

ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ తో భద్రత మరింత కట్టుదిట్టం
ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ తో భద్రత మరింత కట్టుదిట్టం

సరిహద్దుల్లో పహారా కాచే సైన్యం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్లాలంటే కాలి నడకను ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి Read more

అమెరికా ఐరోపా నుంచి కూడా రన్యారావు బంగారం స్మగ్లింగ్
అమెరికా ఐరోపా నుంచి కూడా రన్యారావు బంగారం స్మగ్లింగ్

దుబాయ్ నుంచి అక్రమ బంగారం స్మగ్లింగ్ కేసు: కన్నడ నటి రన్యా రావు అరెస్టు ప్రముఖ కన్నడ నటి రన్యా రావు అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×