దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఇకపై ఆధార్ తరహాలో అపార్ (Automated Permanent Academic Account Registry – APAAR) గుర్తింపు కార్డు అందుబాటులోకి రానుంది. ‘వన్ నేషన్- వన్ ఐడీ’ పేరుతో 17 అంకెలుండే ఈ కార్డులు ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా అందించారు.
పాఠశాలల విద్యార్థులకు తప్పనిసరి
దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు ఈ కార్డు జారీ చేయనున్నారు. అపార్ కార్డు పేరుతో దీన్ని తీసుకురానున్నారు. అపార్‌కార్డ్ అంటే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ . కేంద్రప్రభుత్వం అపార్ కార్డ్ పేరుతో వన్ నేషన్-వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. కానీ ఈ తరహాలో తల్లిదండ్రులకు కొన్నిఇబ్బందులకు గురవుతున్నారు. పేరెంట్స్ తమ పేర్లను, చిరునామాలు అక్షర దోషాలు లేకుండా సమర్పించాలి. దీనితో వారు మీ సేవ చుట్టు తిరుగుతున్నారు. గంటలకొద్దీ వీటికోసం వేచి వుండాలి. జాబ్ చేసే తల్లులకు ఈ ప్రాసెస్ కోసం సెలవులకు తీసుకునేందుకు ఇబ్బందిగా వుంటున్నది.

విద్యార్థి కుటుంబ వివరాలు
ఈ ఆపార్ కార్డ్ బాధ్యతను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్ ఆచార్య సహస్రబుద్దే దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ఈ ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే చాలు.. విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికేట్లు తదితర వివరాలన్నీతెలుసుకోవచ్చు. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుంది.
17 అంకెలున్న నంబర్
ఈ కార్డుతో దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే దగ్గర పొందుపరిచేలా చేస్తోంది కేంద్రం. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. అన్ని వివరాలు ఇందులో ఉండనున్నాయి. పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడేలా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతోపాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించడం జరుగుతుంది. ఈ అపార్ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణించనున్నారు.