A case has been registered against former BRS MLA Haripriya

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియపై కేసు నమోదు

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా ఇల్లెందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే పార్టీ పిలుపు మేరకు ఇల్లెందులో హరిప్రియ, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ దిండిగల రాజేందర్ తో పాటు మరో 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో వారు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కూడా జరిగింది. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరిప్రియతో పాటు ధర్నాలో పాల్గొన్న వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా కార్యక్రమాన్ని నిర్వహించారంటూ కేసు బుక్ చేశారు.

Advertisements
Related Posts
అదానీపై US కోర్టు కేసులో ఊహించని ట్విస్ట్
adani news

అదానీపై అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో టర్న్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్పై US DOJ లంచం, అవినీతి అభియోగాలు నమోదే చేయలేదని Read more

మహారాష్ట్ర, జార్ఖండ్ : ఎన్నికల హోరాహోరీ, అభ్యర్థుల వారీగా పోటీ
vote 1

మహారాష్ట్ర మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4,136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని Read more

అనంతపురంలో పరువు హత్య?
honor killing

భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నా, పరువు కోసం జరుగుతున్న హత్యలు ఇంకా సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కుటుంబ పరువు, సంప్రదాయాల పేరుతో తల్లిదండ్రులే తమ పిల్లల Read more

రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
lokesh300cr

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రేపు ఉదయం సా.4.30 గంటలకు ఢిల్లీకి ప్రయాణం ప్రారంభిస్తారని అధికారికంగా తెలియజేశారు. ఈ పర్యటన ద్వారా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి, Read more

Advertisements
×