అల్లు అర్జున్ కాష్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. తొక్కిసలాటకు తన క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని వాదించిన అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ప్రీమియర్ షో గురించి ముందుగానే చెప్పామన్న లాయర్. పోలీసులకు థియేటర్ నుంచి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు వివరించిన న్యాయవాది. బందోబస్తు కావాలని డిసెంబర్ రెండవ తేదీని లేఖ రాసినట్లు వివరించారు. ఈ మేరకు ఆ లేఖను న్యాయమూర్తికి అందించారు.
ప్రీమియర్ షో కి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెబుతున్న పోలీసులు. బెయిలు లేదా క్వాష్ పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వ న్యాయవాది వాదన. పోలీసుల నుండి అక్నాలడ్జిమెంట్ కాపీని అడిగి తీసుకున్న న్యాయమూర్తి. అల్లు అర్జున్ పై ఉన్న అభియోగాలు ఏమిటో వివరంగా చెప్పాలని ప్రశ్నించిన కోర్టు. సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వచ్చేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేసిన ప్రభుత్వ న్యాయవాది. ఆరోజు పోలీసులు ఇచ్చిన క్లారిటీ కాపీని కోర్టు ముందు ఉంచిన పోలీసులు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఏ 11గా అల్లు అర్జున్ ఉన్నారని చెప్పిన ప్రభుత్వ న్యాయవాది. ఈ కేసులో ఇప్పటిదాకా 7 గురిని అరెస్టు చేసినట్లు వివరించిన జీపి.