కొంతమంది ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తుండడంతో యజమానులు వారికీ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. అయితే కొంతమంది మాత్రం వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారు. పనిచేస్తున్న ఇంటికే కన్నంపెట్టడం , దొంగతనాలు చేయడం వంటి నేరాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ పనిమనిషి చేసిన పని మాత్రం సభ్య సమాజం ఛీ అనుకునేలా చేసింది.
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో గత 8 ఏళ్లుగా వంట చేస్తోంది. నమ్మకస్తురాలే కదా అని ఆమెను ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఇంట్లో కూరగాయలు, వస్తువులు మాయమవుతున్నాయి. దీంతో ఇంటి యజమాని ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ కెమెరా లో రికార్డు అయినా దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. పనిమనిషి వంట వండేందుకు వచ్చి.. ఓ పాత్ర తీసుకొని ఆ పాత్రలోనే మూత్రం పోసింది. అదే పాత్రలో పిండి పిసికి రోటీలు చేసింది. ఆ రోటీలనే పిల్లలకు అల్పాహారంగా వడ్డించింది. వీడియోను చూసిన తర్వాత ఇంటి యజమానికి క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్‌స్టేషన్(Crossing Public Police Station)లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ తొలుత తనకేం తెలియదని బుకాయించింది. అయితే ఆమెకు వీడియో చూపించి ప్రశ్నించగా తన నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లో జరిగింది.