తమిళ స్టార్ హీరో అజిత్ రైడింగ్, రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిన విషయమే. రైడింగ్ విషయంలో తనకు ఉన్న అనుభవంతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న అజిత్, తాజాగా ప్రత్యేకంగా రూపొందించిన కారుతో రేసింగ్ ట్రాక్‌పై ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సందర్భంలో, ఆయన కారు అదుపుతప్పి ట్రాక్ సైడ్ వాల్ను బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో అజిత్ కు ఎలాంటి గాయాలు కాకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. కారు ప్రమాదానికి గురైనప్పటికీ, అతను సురక్షితంగా ఉండడం దేవుడి దయ అని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఘటన అనంతరం అజిత్ ప్రాక్టీస్‌ను ఆపేసి విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం. రైడింగ్, రేసింగ్ విషయంలో అజిత్ ప్రొఫెషనల్ లెవల్‌లో ఉన్నప్పటికీ, ఇలాంటి ప్రమాదాలు అనివార్యమవుతుంటాయి. ఈ సంఘటన అభిమానులను కొంత కలవరపెట్టింది. రేసింగ్ అనేది ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, భవిష్యత్తులో అజిత్ మరింత జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సోషల్ మీడియాలో అభిమానులు తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. “రైడింగ్ పట్ల మీకు ఉన్న అభిరుచి మాకు గర్వకారణం, కానీ మీ సురక్షితమే మాకు ప్రధానమైనది” అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అజిత్ భద్రతపై దృష్టి పెట్టాలని, రేసింగ్‌లో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.