Headlines
ys sharmila asked cm chandrababu to pay the pending dues of aarogyasri

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు: షర్మిల

అమరావతి: పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకం. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చింది. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే ఇదంతా. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది అని షర్మిల ఫైర్‌ అయ్యారు.

image
image

ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ.. వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవి అయినా.. వాటిని చెల్లించే బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉంది. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి. పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు తక్షణం విడుదల చేయండి. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలి అని వైఎస్‌ షర్మిల డిమాండ్ చేశారు.

వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలంటూ చంద్రబాబుు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తోన్నామని షర్మిల చెప్పారు. పెండింగ్ బకాయిలు 3,000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sei ehrlich und authentisch; wahre freunde schätzen dich für das, wer du bist. International organic company (ioc) – twój zaufany producent suplementów diety. Advantages of local domestic helper.