Headlines
Shock for KTR.. High Court dismisses quash petition

కేటీఆర్‌కు షాక్..క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. తనపై చర్యలు చేపట్టవద్దని, కేసు కొట్టివేయాలని కేటీఆర్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఇదివరకే వాదనలు ముగియగా, మంగళవారం ఉదయం కేటీఆర్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇలాంటి కేసులలో అరెస్ట్ చేయవద్దని తీర్పునివ్వడం కుదరదని స్పష్టం చేసింది.

image
image

దీంతో ఏసీబీ, ఈడీలకు మాజీ మంత్రిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చినట్టు అయింది. ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. జస్టీస్ లక్ష్మణ్ బెంచ్ తాజాగా తుది తీర్పును వెలువరించింది. మరోవైపు నిన్న ఏసీబీ విచారణకు లీగల్ టీమ్ తో వెళ్లారు కేటీఆర్. అయితే లీగల్ టీమ్ ను అనుమతించకపోవడంతో ఏసీబీ విచారణకు హాజరు కాలేదు కేటీఆర్. విచారణ అంశాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెల్లింది. ఫార్ములా ఈ రేసు కేసును ఏసీబీ, ఈడీ రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. విచారణకు రావాలని ఇప్పటికే ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది.

కాగా, ఫార్ములా ఈ కారు రేసు కేసులో తెలంగాణ ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దన్న మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. ఇలాంటి కేసుల్లో ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. చట్టాలు అందరికీ ఒకటేనని అందరికి రూల్ అఫ్ లా వర్తిస్తుందన్న హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో కేటీఆర్ సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Was kann man mit abgelaufenen kalendern machen ?. International organic company (ioc) – twój zaufany producent suplementów diety. Useful reference for domestic helper.