2019లో విడుదలైన ఈ చిత్రం పూర్ణ అనే యువ క్రికెటర్ జీవితంలో ప్రేమ, విఫలం,పెళ్లి, కష్టం, విజయాల రసవత్తర ప్రయాణాన్ని చూపిస్తుంది.ఈ సినిమాను హాట్‌స్టార్‌లో చూడొచ్చు. 2012లో విడుదలైన తెలుగు చిత్రం ధోనీ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ స్ఫూర్తితో తెరకెక్కింది. ఓ 14 ఏళ్ల కుర్రాడు భారత జట్టులో ఆడాలని కలగంటాడు, కానీ అతని తండ్రి కలలు తీరడానికి ఎదురొడ్డి నిలుస్తాడు. ప్రకాశ్ రాజ్ తండ్రి పాత్రలో ఆకట్టుకుంటాడు.ఈ సినిమా ఇప్పుడు హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. 1983లో ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన ఘనతను ఆధారంగా తీసుకున్న 83 చిత్రం కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటనతో ఆదర్శప్రాయం. ఈ చిత్రాన్ని తెలుగులోనూ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఆమిర్ ఖాన్ నటించిన లగాన్ 2001లో విడుదలై క్లాసిక్‌గా నిలిచింది.
బ్రిటిష్ కాలంలో పన్నుల భారం నుంచి విముక్తి పొందడానికి క్రికెట్ మ్యాచ్ ఆడే గ్రామస్తుల కథను ఆసక్తికరంగా చూపించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్రం 2016లో విడుదలైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనీ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు.హాట్‌స్టార్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది. 2005లో విడుదలైన ఇక్బాల్ ఓ చెవిటి, మూగ కుర్రాడి కథ. భారత జట్టులో స్థానం సంపాదించాలని కలగన్న అతని పోరాటం ఈ చిత్రానికి హృదయాన్ని తాకే అంశం.ఈ సినిమాను జీ5, ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. తమిళ చిత్రం లబ్బర్ పండు ఈ ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.గ్రామీణ క్రికెటర్ల మధ్య ఈగో clash చుట్టూ నడిచే కథతో సినిమా ఆకట్టుకుంది.ఇది ఇప్పుడు హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత ఆధారంగా రూపొందిన శభాష్ మిథూ చిత్రంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించింది.