Headlines
viayasai reddy

రాజ్యసభ సభ్యులపై విజయసాయి కీలక వ్యాఖ్యలు

ఇటీవల ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను కుట్రపూరితంగా ప్రలోభాలకు గురి చేసి లాక్కున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరిచేత రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు.
వైసీపీ నేతలపై టీడీపీ అక్రమ కేసులు పెట్టి, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని, అంతేకాదు టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికలో అమలు కానీ వాగ్దానాలు చేసి, గెలుపొందిన తర్వాత ప్రజలను విస్మరించారు అని విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పేదలకు ఇచ్చే ఆర్థిక సాయం అందడం లేదని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Baltimore orioles owner peter angelos. Fdh visa extension. Manunggal air tni ad, menjadi solusi air bersih untuk seluruh negeri.