Headlines
bhaskar reddy

చెవిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన ఓ కేసులో హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం వార్తలను సోషల్ మీడియాలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆంధ్రారాజకీయాలలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తనపై టీడీపీ కక్ష రాజకీయాలు చేస్తున్నదని, తనకు సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారని, కావున ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. చెవిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు తదుపరి విచాణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మరోవైపు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

A cartoon depiction of an ancient man meeting a brutal death. Advantages of overseas domestic helper. Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam.